ఈ వారం నాల్గవ ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నష్టాల్లో మొదలైంది, అయితే కొంత సమయం తరువాత లాభాల్లోకి దారితీసింది. మరోకొద్దిసేపటికి టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్ షేర్లు క్షీణించినట్లు కనిపించాయి. దింతో షేర్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత టాటా మోటార్స్ షేర్లు 9 శాతం పడిపోయింది. ఈ కంపెనీలో భారీ వాటా ఉన్న దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖా జున్‌జున్‌వాలాకు పెద్ద దెబ్బ తగిలి కొద్ది నిమిషాల్లో రూ. 325 కోట్లు కోల్పోయింది.
ఈ షేరు ప్రారంభమైన వెంటనే
టాటా మోటార్స్ షేర్ గురించి మాట్లాడితే గురువారం షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు ఈ ఆటోమొబైల్ కంపెనీ షేరు ధర నిన్నటి క్లోసింగ్ నుండి జారిపడి రూ.709 వద్ద ప్రారంభమైంది. కానీ ఈ పతనం మరింత వేగంగా పెరిగింది. చివరికి ఈ స్టాక్ దాదాపు 9 శాతం తగ్గి రూ.683కి చేరుకుంది. ఈ క్షీణత కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ (టాటా మోటార్స్ ఎంకాప్) కూడా రూ.2.59 లక్షల కోట్లకు తగ్గింది.

టాటా మోటార్స్ షేర్లు ఎందుకు పడిపోయాయి?
టాటా మోటార్స్ షేర్లు భారీగా క్షీణించడం వెనుక గల కారణాల గురించి మాట్లాడినట్లయితే కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాలు నిరాశను మిగిల్చాయి. టాటా మోటార్స్ మూడవ త్రైమాసిక లాభం మార్కెట్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. దింతో 22 శాతం తగ్గి రూ.5,451 కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, చాలా బ్రోకరేజీలు కంపెనీ రేటింగ్‌లలో మార్పులు చేశాయి. ఈ విషయాల ప్రభావంతో గురువారం కంపెనీ షేర్లలో భారీ పతనం కనిపించింది.
జెఫరీస్ టు గోల్డ్‌మన్ మార్పులు:
ఒకవైపు విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ టాటా మోటార్స్ షేర్ల రేటింగ్‌ను 'buy' నుండి 'అండర్ పెర్ఫార్మ్'కి తగ్గించింది అలాగే దాని టార్గెట్ 30 శాతం తగ్గించి రూ.660కి చేసింది. ఇతర గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలలో గోల్డ్‌మన్ సాచ్స్ టాటా మోటార్స్‌పై రూ. 800 టార్గెట్ కొనసాగించగా, మోర్గాన్ స్టాన్లీ ఒక్కో షేరుకు రూ. 853 టార్గెట్ తగ్గించింది.
రేఖ ఝున్‌జున్‌వాలా ఎలా నష్టపోయారు:
టాటా మోటార్స్ షేర్ల పతనం కారణంగా, దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న అతని భార్య రేఖ జున్‌జున్‌వాలా సంపద ఒక్కసారిగా రూ.325 కోట్లకు పైగా తగ్గింది. డేటాను పరిశీలిస్తే 31 డిసెంబర్ 2024 నాటికి జున్‌జున్‌వాలా టాటా మోటార్స్ సంస్థలో 4,77,70,260 ఈక్విటీ షేర్లు లేదా 1,30 శాతం వాటా ఉంది. బుధవారం షేర్ క్లోసింగ్ ధర రూ.752.45 వద్ద ఈ వాటా విలువ 3,594.47 కోట్లుగా ఉంది. గురువారం టాటా మోటార్స్ షేర్లు 9.06 శాతం పడిపోయి రూ.684.25కి చేరాయి, దీంతో రేఖా జున్‌జున్‌వాలా వాటా రూ.3,268.68 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications