IPO News: నేడే ప్రారంభమైన 3 ఐపీవోలు.. గ్రేమార్కెట్లో ఆధిపత్య విధ్వంసం..

Upcoming IPOs: మే నెలలో ఐపీవో క్యాలెండర్ నిండిపోయింది. వరుసగా ఐపీవోలు రాకతో పాటు లిస్టింగ్ కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం బిజిబిజిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నేడు బెట్టింగ్ వేసే పెట్టుబడిదారుల కోసం 3 ఐపీవోలు అవకాశం తెరుచుకుంది. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో వెరిటాస్ అడ్వర్టైజింగ్, మన్‌దీప్ ఆటో ఇండస్ట్రీస్, ఇండియన్ ఎసోఫియర్ కంపెనీల ఐపీవోలు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకున్నాయి.

మన్‌దీప్ ఆటో ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.67గా నిర్ణయించారు. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1,34,000 పెట్టి లాట్ షేర్ల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో మే 13న తెరుచుకుని మే 15, 2024న ముగియనుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.25.25 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఐపీవో దరఖాస్తుదారులకు 37.68 లక్షల షేర్లను జారీ చేసింది. ప్రస్తుతం ఐపీవో ఒక్కో షేరుకు గ్రేమార్కెట్లో రూ.15 ప్రీమియం ధర పలుకుతోంది.

3 IPOs that opened for retail investors today rocking in Grey markets Know details

నేడు ఐపీవో ప్రారంభించిన మరో కంపెనీ ఇండియన్ ఎముసోఫియర్. ఐపీవో సబ్‌స్క్రైబర్ల కోసం నేడు తెరుచుకున్న ఐపీవో మే 16న ముగియనుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల నుంచి రూ.42.39 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ 32.11 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.

ప్రస్తుతం కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.125 నుంచి రూ.132గా నిర్ణయించింది. లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం రూ.1,32,000 వెచ్చించాల్సి ఉంటుంది. నేడు గ్రేమార్కెట్లో కంపెనీ ఒక్కో షేరుకు రూ.180 ప్రీమియం ధర పలుకుతోంది. వాస్తవానికి ఇది ఆదివారం జీఎంపీ కంటే 20 రూపాయలు అధికం.

ఇక చివరిగా నేడు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరుచుకున్న ఐపీవో వెరిటాస్ అడ్వర్టైజింగ్ కంపెనీదే. కంపెనీ ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.109 నుంచి రూ.114గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం ఐపీవో మే 13 నుంచి 15 వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం రూ.1,36,800 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లకు రూ.100 ప్రీమియం ధర కొనసాగుతోంది. లిస్టింగ్ వరకు పరిస్థితి కొనసాగితే కంపెనీ స్టాక్ మార్కెట్‌లో బలమైన లిస్టింగ్ నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+