IPO News: ఈవారం కొత్తగా మార్కెట్లోకి 3 ఐపీవోల రాక.. 2 ఐపీవోల లిస్టింగ్.. పూర్తి వివరాలు..
IPO News: ఈవారం మార్కెట్లోకి వస్తున్న మెుత్తం ఐపీవోల విలువ సుమారు రూ.665 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో మార్కెట్లోకి దాదాపు 5 కంపెనీలు అరంగేట్రం చేస్తున్నాయి. వరుసగా మార్కెట్లోకి క్యూ కడుతున్న ఐపీవోల లాంచ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..
దేశంలోని ప్రైమరీ మార్కెట్ల మూడ్ చాలా దృఢంగా కొనసాగుతోంది. దీంతో మార్కెట్లలోకి అడుగుపెడుతున్న దాదాపు అన్ని ఐపీవోలు సక్సెస్ అవుతున్నాయి. మెుదటగా ఆగస్టు 22న ఫ్లెక్సిబుల్ ఫ్లో సొల్యూషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఐపీవో ప్రారంభం అవుతోంది. దీని ఒక్కో షేరు ధరను రూ.102-108గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.351 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.

రెండవ ఐపీవోగా వస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా ఆగస్టు 24న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం అవుతోంది. దీని స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.94-99గా కంపెనీ నిర్ణయించింది. 3.12 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మార్కెట్ల నుంచి రూ.309 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. దీని తర్వాత వస్తున్న మూడో ఎస్ఎమ్ఈ ఐపీవో సన్‌గర్నర్ ఎనర్జీస్ ఆగస్టు 21-23 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.83గా కంపెనీ ఐపీవో కోసం నిర్ణయించింది.
పిరమిడ్ టెక్నోప్లాస్ట్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 22న ముగియనుంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలోని షూరా డిజైన్స్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఆగస్టు 21న ముగించనుంది. క్రాప్ లైఫ్ సైన్స్ అండ్ బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూలకు చివరి రోజు ఆగస్టు 22గా ఉంది.
ఇక మార్కెట్ లిస్టింగ్స్ విషయానికి వస్తే.. TVS సప్లై చైన్ సొల్యూషన్స్ ఆగష్టు 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇదే క్రమంలో హెర్బల్ ఉత్పత్తుల తయారీ సంస్థ షెల్టర్ ఫార్మా ఐపీవో కూడా అదే రోజు BSE SMEలో జాబితా చేయబడనుంది. వరుసగా మార్కెట్లలో ఐపీవోలా కోలాహలం కొనసాగుతున్న తరుణంలో రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లపై, ఐపీవోలపై ఎక్కువగా దృష్టి సారించారు.


Click it and Unblock the Notifications