దీపావళి పండుగ స్పెషల్ గూగుల్ ఒక సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. మనందరికీ తెలిసినట్టు గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజ్ ఎప్పుడూ తక్కువగానే అనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు అన్నీ కలిపి గూగుల్ అకౌంట్‌లో సేవ్ చేయడం మనకి హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు పండుగ సీజన్‌లో మరీ ఎక్కువ ఫోటోలు తీసే టైమ్ కాబట్టి, గూగుల్ తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ ఇస్తోంది.
ఇప్పుడూ కేవలం రూ. 11కే మీరు 2TB వరకు స్టోరేజ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ధర మొదటి మూడు నెలలకే వర్తిస్తుంది. ఆ తర్వాత రెగ్యులర్ రేట్‌కి వెళ్ళిపోతుంది. అయినా మొదట్లో ఇంత తక్కువ ధరలో ప్లాన్ ట్రై చేయడం మీకు చాలా సేవ్ అవుతుంది.

ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
1. మీ Google అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
2. [Google One](https://one.google.com/) వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి.
3. మీకు నచ్చిన స్టోరేజ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి.
4. పేమెంట్ పూర్తి చేసి సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకోండి.
నెలవారీ ప్లాన్‌లు:
గూగుల్ ఈ దివాళీకి తీసుకొచ్చిన ప్లాన్‌లు చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. మొత్తం నాలుగు ప్లాన్‌లు 30GB, 100GB, 200GB, 2TB ఉన్నాయి. మొదటగా Lite 30GB ప్లాన్ గురించి చెప్పాలంటే, మొదటి మూడు నెలల పాటు కేవలం రూ.11కే దొరుకుతుంది, ఆ తర్వాత ప్రతి నెల రూ. 59 మాత్రమే. చిన్న ఫైల్స్, ఫోటోలు సేవ్ చేసుకునే వారికి ఇది బాగుంటుంది. Basic 100GB ప్లాన్ కూడా ఇదే విధంగా మొదటి మూడు నెలలు రూ. 11కే లభిస్తుంది, ఆ తర్వాత నెలకు రూ. 130. కొంచెం ఎక్కువ డేటా స్టోర్ చేయాలనుకునే వాళ్లకు ఇది సరైన ఆప్షన్. Standard 200GB ప్లాన్ తీసుకుంటే మొదటి మూడు నెలలకి రూ. 11కే, తర్వాత ప్రతి నెల రూ. 210 చెల్లించాలి ఇది పెద్ద సైజ్ ఫోటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు స్టోర్ చేసుకునే వాళ్లకు సరిపోతుంది. చివరగా Premium 2TB ప్లాన్ ఉంది, ఇది కూడా మొదటి మూడు నెలలకి రూ. 11కే దొరుకుతుంది, కానీ తర్వాత ప్రతి నెల రూ. 650 అవుతుంది. ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా చూస్తే, మీ అవసరానికి తగిన ప్లాన్‌ని మాసికంగా తీసుకోవచ్చు లేదా దీర్ఘకాలం ఉపయోగించాలనుకుంటే వార్షిక ప్లాన్‌లను కూడా ట్రై చేయొచ్చు. రెండింటిలోనూ పండుగ ఆఫర్‌లో మంచి తగ్గింపు ఉంది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
వార్షిక ప్లాన్‌ల విషయానికి వస్తే, గూగుల్ చాలా మంచి డిస్కౌంట్లను ఇచ్చింది. చిన్నవారికి సరిపోతే Lite 30GB ప్లాన్ సంవత్సరం పూర్వం రూ. 479కి లభిస్తుంది. కొంచెం ఎక్కువ డేటా కోసం Basic 100GB ప్లాన్ ఉంది, ఇది ఇప్పుడు రూ. 1000కే లభిస్తుంది, అసలు ధర రూ. 1560. మరింత ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే Standard 200GB ప్లాన్ ఉంది, ఇది రూ. 1600లో లభిస్తుంది, అసలు ధర రూ. 2520. చివరగా, పెద్ద వాడుకరుల కోసం Premium 2TB ప్లాన్ ఉంది, ఇది ఇప్పుడు రూ. 4900కే లభిస్తుంది, అసలు ధర రూ. 7800. ఈ తగ్గింపు ధరలు మీరు సబ్‌స్క్రైబ్ చేసే తేదీ నుండి ఒక సంవత్సరానికి వర్తిస్తాయి, ఆ తరువాత మళ్లీ ప్లాన్‌లకు మామూలు ధర అమలులోకి వస్తుంది.
గమనిక: ఈ ఆఫర్ స్పెషల్‌గా లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. గూగుల్ ఇంత తక్కువ ధరలో స్టోరేజ్ ఇవ్వడం చాలా అరుదు. 2TB ప్లాన్ కూడా మొదటి మూడు నెలలు కేవలం రూ. 11కే దొరకడం నిజంగా బంగారం లాంటి ఆఫర్. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా స్టోర్ చేసుకునే వాళ్లకి ఇది మిస్ చేసుకోకండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications