Success Story: 27 ఏళ్ల వయసు.. కేవలం 3 నెలల్లోనే బిలియనీర్.. ఇది కదా సక్సెస్
Zyber 365: అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని బ్రతికే స్థాయిలో సంపాదించడం ఈ రోజుల్లో కష్టమైపోయింది. ఇందుకు భిన్నంగా మరికొందరు స్మార్ట్‌గా పనిచేస్తూ అతి తక్కువ వయసులోనే కోటీశ్వరులైపోతున్నారు. మూడు పదుల వయసు దాటక ముందే బిలీయనీర్‌గా మారిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఎన్నో కష్టానష్టాలను భరించి, ఎంచుకున్న ఆశయాన్ని సాధించిన 27 ఏళ్ల పెర్ల్ కపూర్.. భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా చరిత్రకెక్కారు. ఆయన స్టార్టప్ Zyber 365 రిటైల్ రంగాన్ని షేక్ చేస్తూ ప్రారంభించిన 3 నెలల్లోనే యునికార్న్ స్థాయికి చేరింది. తద్వారా టెక్ ప్రపంచంలో ఆయన ఓ రోల్‌మోడల్‌గా ఎదిగారు.

మే 2023లో స్థాపించబడిన Zyber 365.. Web3 మరియు AI-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టప్. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. కాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొదలుపెట్టిన మూడు నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్ల విలువతో భారత్ సహా ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్‌గా రికార్డు నెలకొల్పింది.
Zyber 365 వ్యవస్థాపకులు మరియు CEO అయిన పెర్ల్ కపూర్ కంపెనీలో 90 శాతం వాటా కలిగి ఉన్నారు. తద్వారా 1.1 బిలియన్ డాలర్ల నికర విలువ ఆయన సొంతం. Zyber 365కి ముందు AMPM స్టోర్‌లో ఆర్థిక మరియు యాంటీయర్ సొల్యూషన్స్‌కు వ్యాపార సలహాదారునిగా విధులు నిర్వర్తించారు. ఫిబ్రవరి 2022లో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు.
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుంచి MSC ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ లో కపూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. Web3 టెక్నాలజీ రంగంలో ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. బ్లాక్‌చెయిన్, AI మరియు సైబర్‌సెక్యూరిటీ వంటి ఎక్స్‌పోనెన్షియల్ టెక్నాలజీలను అధ్యయనం చేశారు. సాంకేతికత సమాజాన్ని ప్రభావితం చేసే గ్లోబలైజేషన్ 3.0 విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications