2024 News: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా చాలా మంది ఉద్యోగులు తమ ప్రస్తుత జాబ్స్ మానేందుకు కొద్దిగా సంకోచిస్తున్నారు. అయితే 2024లో ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోనుందిని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 28 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత యజమానులను విడిచిపెట్టాలని ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నారు. వీరు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చురుకుగా వెతుకున్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) సర్వేలో వెల్లడైంది. అందువల్ల యజమానులు తమ ఉద్యోగులకు నిజంగా ముఖ్యమైనది ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడి పెట్టడం గతంలో కంటే చాలా క్లిష్టమైనదిగా మారినట్లు నివేదికలో పేర్కొంది.

బీసీజీ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతో సహా మరో 8 దేశాల్లో 11,000 మంది నుంచి సేకరించిన సర్వే సమాచారం ప్రకారం ఈ వివరాలను వెల్లడించింది. వీరిలో సగం మంది పని గంటలు, వేతన చెల్లింపులు, బెనిఫిట్స్ కోసం మారుతున్నట్లు వెల్లడించారు. మరికొందరు తమకు ఇష్టమైన పనికోసం, సపోర్ట్ కోసం మారుతున్నట్లు పేర్కొన్నారు. అసలు ఉద్యోగం మారటానికి ఏది పురికొల్పుతుందని ప్రశ్నించగా ఎక్కువ మంది ఉద్యోగులు ఫంక్షనల్ విషయాలను ప్రస్థావించినట్లు వెల్లడైంది.
సంస్థ నిర్వాహకుల పట్ల తీవ్ర అసంతృప్తి, అట్రిషన్ రిస్క్ రెట్టింపు కావడంతో ముడిపడి ఉంటుంది. ప్రపంచ సగటు 28 శాతంతో పోలిస్తే, ఆ సెంటిమెంట్‌తో 56 శాతం మంది ఉద్యోగులు ప్రమాదంలో ఉన్నారు. వాస్తవానికి తమ మేనేజర్‌లతో ఎక్కువగా సంతృప్తి కలిగి ఉండటం రాజీనామాలు రెండింతలు కావటానికి కారణం అవుతుంది.


Click it and Unblock the Notifications