డబ్బు vs ఆనందం... 25 ఏళ్ల టెకీ జీవితంలో ఏది ఎంచుకోవాలి అన్న గందరగోళంలో ఉన్నాడు? మరి అతను ఏం ఎంచుకోవాలి?
బెంగళూరులో 25 ఏళ్ల ఒక టెకీ, అతని మొత్తం ఆస్తి కలిపి సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుంది. ఇది వినడానికి బానే ఉంది కానీ నిజంగా ఆలోచిస్తే తన జీవితం ఒక గందరగోళం లాగా ఉంది. తనకి సోదరులు ఎవరు లేరు, తల్లిదండ్రులు స్థిరంగా ఉన్నారు, హోమ్ లోన్ కూడా చివరి దశలో ఉంది ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి. కానీ ఆరు సంవత్సరాల లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత అతను జీవితాన్ని మళ్ళా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. "ఇప్పుడే కష్టపడీ, త్వరగా రిటైర్ అయ్యి, బాలీలో కాక్‌టైల్స్ తో జీవించాలి" అనేది కేవలం కలలా మాత్రమే ఉంది. రోజు ట్రాఫిక్, జూమ్ కాల్స్, ప్రోమోషన్స్ కోసం వేట ఇవ్వని నిజమైన ఆనందాన్ని మరియు జీవితాన్ని తగ్గించినట్టే అనిపిస్తుంది.

ముందుగా అతను FIRE (ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ) విధానంలో పూర్తిగా డిసిప్లిన్డ్‌గా జీవించేవాడు. SIPs, RSUs, NPS, లోన్ పేమెంట్స్, ప్రతి ఖర్చు అన్నీ క్రమంగా ట్రాక్ చేసి జీవితాన్ని నంబర్స్, డిసిప్లిన్, త్వరగా రిటైర్ అవ్వడం చుట్టూ ప్లాన్ చేసుకున్నాడు. జీవితంలో కేవలం ఫైనాన్షియల్ లక్ష్యాలు, ఆర్థిక నియమాలు, సమయపాలననే ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు, అతను ఆ పద్ధతిని వదిలి, కొత్త దిశలో అన్వేషిస్తున్నాడు. అతను ఎక్కువగా ప్రపంచం చుట్టూ ప్రయాణించడం, బ్యాక్ ప్యాకింగ్తో జీవించే ఫ్రెండ్స్‌ను కలవడం మరియు టెక్ జీవితంలో ఎప్పుడూ ఫీల్ అవ్వని స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. ఇప్పుడు అతనికి డిసిప్లిన్‌తో పాటు స్వేచ్ఛ, కొత్త అనుభవాలు, జ్ఞాపకాలు సృష్టించడం కూడా ముఖ్యమని అనుకుంటున్నాడు.
ఇప్పుడు అతను రెండు మార్గాల మధ్య గందరగోళంలో ఉన్నాడు. ఒక వైపు డిసిప్లిన్ పాటించి, త్వరగా ఆర్థిక స్వతంత్రం పొందాలి, మరొక వైపు 25 ఏళ్లు ఆరోగ్యంగా, కొత్త అనుభవాలను ఆస్వాదిస్తూ జీవించాలి అనే ఆలోచన ఉంది. కొన్ని రోజులు అతను స్టార్టప్‌లో రిమోట్‌గా పని చేద్దాం అని అనుకుంటున్నాడు, మరికొన్ని రోజులు కొన్ని నెలలు ఉద్యోగం వదిలి, ప్రపంచాన్ని చూడాలని కలలు కంటున్నాడు. అసలు సవాల్ కేవలం డబ్బు కాదు సాహసం, స్థిరత్వం, జీవితం మధ్య సరైన సమతుల్యాన్ని కనుగొనడమే.
జీవితంలోని నిర్ణయాలు ఒకేసారి ఫైనల్‌గా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చదు. అందుకే చిన్న ట్రయల్స్ ద్వారా అన్వేషించడం మంచిది. ఉదాహరణగా, మీరు 1-2 నెలలపాటు లీవ్ తీసుకుని, ప్రపంచం చుట్టూ తిరిగి, కొత్త అనుభవాలు సేకరించవచ్చు. ఆ తరువాత, మీరు అనుభవం పొందిన తర్వాత, రిటర్న్ అయ్యి స్టార్టప్‌లో పని చేయడం లేదా జాబ్‌లో కొనసాగించడం అనేది నిర్ణయించుకోవచ్చు. ఇలా చిన్న స్టెప్ప్స్ తీసుకోవడం వలన సాహసం, ఆనందం మరియు ఆర్థిక భద్రత మధ్య సరైన సమతుల్యం ఉంటుంది.
కొంత మంది నెటిజన్లు ప్రోత్సహిస్తూ, "ఇది జీవితానికి ముగింపు కాదు, ఇంకా జీవించవలసిన చాలా ఉన్నాయి. బయటకు వెళ్ళి, ప్రయాణించండి, సంపాదించినది ఆస్వాదించండి. ఫోకస్ మెమోరీస్ క్రియేట్ చేయడంలో ఉండాలి అవి మాత్రమే చివరికి మీతో మిగిలిపోతాయి" అని చెప్పారు. మరొకరు SDE2 colleague ఉదాహరణ ఇచ్చి, అతను చాలా ఫ్రుగల్ అయినా రూ. 40 లక్షల సేవింగ్స్ చేసినట్లు వివరించారు. ఎవరికి రూ. 20 కోట్లు ఉన్నా, కొన్ని నెలలు ప్రయాణించడం సరదా, కానీ ఆ తర్వాత ఏమిటి? డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, జీవితం అన్ని సమానంగా. డబ్బు విషయంలో ప్రేరేపించే అభిరుచి కోసం దారిని కనుగొనాలి, లేక ప్రస్తుత మార్గాన్ని అంగీకరించి, దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించాలి.


Click it and Unblock the Notifications