Mutual Funds: గత ఐదు, ఏడు, పదేళ్లలో అధిక రాబడులు ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
గత ఐదు, ఏడు, పదేళ్ల కాలవ్యవధిలో దాదాపు 23 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు లంప్సమ్ (ఏకమొత్తం) పెట్టుబడులపై 12% కంటే ఎక్కువ చక్రవడ్డీ రేటును (CAGR) అందించాయి. మార్కెట్లో పదేళ్లుగా అందుబాటులో ఉన్న 160 ఈక్విటీ పథకాల పనితీరుతో ఈ 23 ఫండ్లు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ELSS, మల్టీ క్యాప్, లార్జ్ & మిడ్ క్యాప్, ఫోకస్డ్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ వంటి ఏడు విభిన్న విభాగాలకు చెందినవిగా ఉన్నాయి. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఐదు, ఏడు పదేళ్ల కాలంలో లంప్సమ్ పెట్టుబడులపై 12% కంటే ఎక్కువ CAGRని అందించింది. బంధన్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ వరుసగా గత ఐదు, ఏడు, పదేళ్ల కాలంలో 12.73%, 16.86%, 16.60% CAGR రాబడి ఇచ్చింది.
డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఐదు, ఏడు, పదేళ్ల కాలంలో వరుసగా 14.48%, 22.50%, 14.55% రాబడిని అందించింది. ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఐదు, ఏడు, పదేళ్ల కాలంలో12% కంటే ఎక్కువ CAGR రిటర్న్స్ ఇచ్చింది. దీని తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ నిలిచింది. ఇది కూడా ఈ కాలవ్యవధుల్లో 12% కంటే ఎక్కువ CAGRని అందించింది. ఆ తర్వాత జాబితాలో HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, HDFC ఫోకస్డ్ ఫండ్, HDFC మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నాయి. వీటి తర్వాత HSBC మ్యూచువల్ ఫండ్‌కు చెందిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు ఉన్నాయి. HDFC మిడ్ క్యాప్ ఫండ్ మూడు కాలవ్యవధుల్లోనూ 12% కంటే ఎక్కువ CAGRని అందించింది. ఇది గత ఐదు, ఏడు, పదేళ్ల కాలంలో లంప్సమ్ పెట్టుబడులపై వరుసగా 12.71%, 18.55% మరియు 14.07% రాబడిని ఇచ్చింది.

ఇన్వెస్కో ఇండియా లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ లంప్సమ్ (ఏకమొత్తం) పెట్టుబడులపై గత ఐదేళ్లలో 13.07%, ఏడేళ్లలో 15.92% మరియు పదేళ్లలో 14.80% రాబడిని అందించింది. ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ , లంప్సమ్ పెట్టుబడులపై గత ఐదేళ్లలో 14.66%, ఏడేళ్లలో 20.57%, పదేళ్లలో 16.21% వార్షిక సగటు రాబడిని ఇచ్చింది. కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. మరియు పేర్కొన్న కాలవ్యవధుల్లో 12% కంటే ఎక్కువ CAGRని అందించింది. మోతీలాల్ ఓస్వాల్ ELSS టాక్స్ సేవర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్. ఈ రెండు ఫండ్లు కూడా మూడు కాలవ్యవధుల్లోనూ 12% కంటే ఎక్కువ CAGRని అందించాయి.
నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో 14.32%, ఏడేళ్లలో 20.94%, పదేళ్లలో 15.96% రాబడిని ఇచ్చింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా పేర్కొన్న కాలవ్యవధుల్లో 12% కంటే ఎక్కువ CAGRని అందించాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఐదు, ఏడు మరియు పదేళ్ల కాలంలో వరుసగా 15.04%, 31.38%, 18.81% CAGR రాబడి అందించింది. సుందరం మ్యూచువల్ ఫండ్‌కు చెందిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి మూడు కాలవ్యవధుల్లోనూ 12% కంటే ఎక్కువ రాబడి ఇచ్చాయి. యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో లంప్సమ్ పెట్టుబడులపై మూడు కాలవ్యవధుల్లోనూ 12% కంటే ఎక్కువ CAGRని ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications