Tata Steel Shares: గడచిన రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని వారాలుగా కరెక్షన్ ఫేజ్ కొనసాగుతోంది. చాలా కాలం పాటు కొనసాగిన బులిష్ మార్కెట్ల వల్ల ఓవర్ వెయిట్ అయిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయాలతో ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చూస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో నిపుణులు మాత్రం టాటాలకు చెందిన ఒక లిస్టెడ్ కంపెనీ షేర్లు మంచి లాభాలను తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాటా స్టీల్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ 2 శాతానికి పైగా లాభంతో కొనసాగుతున్నాయి. దీంతో ఇంట్రాడేలో ఒక్కో షేరు ధర గరిష్ఠంగా రూ.153.50కి చేరుకున్నాయి. దీనికి తోడు కంపెనీ షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న పెట్టుబడిదారులకు ఒక శుభవార్త ఉంది.

వాస్తవానికి బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గన్ టాటా స్టీల్‌పై 'ఓవర్ వెయిట్' రేటింగ్ కొనసాగించింది. రానున్న ఏడాది కాలంలో టాటా స్టీల్ కంపెనీ షేర్ల ధర రూ.180కి చేరుకుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇది ప్రస్తుతంలో కంపెనీ షేర్ ట్రేడింగ్ రేటు కంటే దాదాపు 20 శాతం అధికం కావటం గమనార్హం. ఇదే క్రమంలో కంపెనీ షేర్లను ట్రాక్ చేస్తున్న 35 మంది విశ్లేషకుల్లో దాదాపు 21 మంది టాటా స్టీల్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మరో 8 మంది నిపుణులు కంపెనీ షేర్లకు ప్రస్తుతం హోల్డ్ రేటింగ్ కొనసాగిస్తున్నారు. కేవలం 6 మంది ఇన్వెస్టర్లు మాత్రమే కంపెనీ షేర్లకు సెల్ రేటింగ్ అందించారు. వాస్తవానికి ఈ ఏడాది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించిన టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో టాటా స్టీల్ మూడవదిగా ఉంది.
బ్రోకరేజీలు బులిష్ దేనికి..?
వాస్తవానికి టాటా యూరోపియన్ వ్యాపారంలో ఆదాయ వృద్ధికి సానుకూల కారణాలు ఉన్నాయని విదేశీ బ్రోకరేజీలు చూస్తున్నాయి. ఈ క్రమంలో హాంకాంగ్, సింగపూర్‌లలో జరుగుతున్న మార్కెటింగ్ ఈవెంట్‌ల సమయంలో టాటా స్టీల్ షేర్లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. జర్మనీ మౌలిక సదుపాయాల నిధి ప్రకటన, యూరోపియన్ స్టీల్ స్ప్రెడ్‌ల్లో పదునైన పెరుగుదల వంటి ఇటీవలి పరిణామాలు కంపెనీకి కలిసొచ్చే అంశంగా జేపీ మోర్గన్ విశ్వసిస్తోంది. మూడవ త్రైమాసిక సగటుతో పోలిస్తే యూరోపియన్ స్టీల్ స్ప్రెడ్‌లు త్రైమాసికం వారీగా 18 శాతం,స్పాట్ ప్రాతిపదికన 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
ఉదయం 11.45 గంటల సమయంలో టాటా స్టీల్ కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.150.35 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్లు మార్కెట్ల ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ కేవలం 2 శాతం మాత్రమే నష్టాన్ని చూశాయి. అలాగే 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే 10 శాతం వరకు లాభంతో కొనసాగుతున్నాయి. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.184.60గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.122.62గా కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications