2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మానవ చరిత్రలో ఈ ఏడాదిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం'గా చెప్పకోవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే చూసిన హ్యూమనాయిడ్ రోబోలు, మన ఆలోచనలను పసిగట్టే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది నిజమయ్యాయి. గూగుల్, ఓపెన్ ఏఐ, టెస్లా వంటి దిగ్గజ సంస్థల మధ్య జరిగిన పోరు వల్ల సామాన్యులకు అద్భుతమైన టెక్నాలజీ పరిచయమైంది. మరి 2025 లో ఏఐ రంగంలో జరిగిన ఆ ఆసక్తికర పరిణామాలు ఏంటో ఓసారి చూద్దామా?

ప్రారంభం నుంచే ఏఐ హోరు!
ఈ ఏడాది జనవరిలో చైనాకు చెందిన 'డీప్‌సీక్' (DeepSeek-R1) మోడల్‌తో సంచలనం మొదలైంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ రీజనింగ్ సామర్థ్యాన్ని చూపిస్తూ అమెరికా కంపెనీలకు సవాలు విసిరింది. ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన 'ఏఐ యాక్షన్ సమ్మిట్'లో మన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కలిసి ఏఐ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఓపెన్ ఏఐ తన 'GPT-4.5' వెర్షన్‌ను విడుదల చేసి మల్టీమోడల్ స్కిల్స్ (వాయిస్, టెక్స్ట్, ఇమేజ్) లో తన సత్తా చాటింది.
హ్యూమనాయిడ్ రోబోలు
2025 లో రోబోటిక్స్ రంగం ఊహించని మలుపు తిరిగింది. గూగుల్ డీప్‌మైండ్ 'జెమిని రోబోటిక్స్'ను తీసుకురాగా.. ఇది భౌతిక ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకునే స్థాయికి చేరింది.
• టెస్లా ఆప్టిమస్ (Tesla Optimus): ఎలన్ మస్క్ తన హ్యూమనాయిడ్ రోబోలను పైలట్ ప్రొడక్షన్ స్థాయికి తెచ్చారు. ఏడాది చివరి నాటికి 5,000 రోబోలను సిద్ధం చేయాలనే లక్ష్యానికి దగ్గరయ్యారు.
• మనుస్ (Manus AI): ఎటువంటి మనిషి పర్యవేక్షణ లేకుండానే పనులు పూర్తి చేసే అటానమస్ ఏఐ ఏజెంట్‌గా 'మనుస్' గుర్తింపు పొందింది.
GPT-5.. జెమిని 3 మధ్య పోరు
మిడ్-ఇయర్‌లో టెక్ వార్ పీక్ స్టేజ్‌కి చేరింది. ఆంత్రోపిక్ 'క్లాడ్ 4'ను విడుదల చేయగా.. గూగుల్ తన 'జెమిని 2.5', 'ఫ్లాష్' మోడళ్లతో కౌంటర్ ఇచ్చింది. ఆగస్టులో ఎంతో కాలంగా వేచి చూస్తున్న 'GPT-5'ని ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. అయితే నవంబర్‌లో గూగుల్ విడుదల చేసిన 'జెమిని 3' (Gemini 3) తన అడ్వాన్స్‌డ్ రీజనింగ్ సామర్థ్యంతో ఏఐ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
డిస్నీ - ఓపెన్ ఏఐ బిలియన్ డాలర్ డీల్
డిసెంబర్ మాసంలో ఒక భారీ ఒప్పందం కుదిరింది. వాల్ట్ డిస్నీ కంపెనీ తన 200లకు పైగా ఫేమస్ క్యారెక్టర్లను ఓపెన్ ఏఐ 'సోరా' (Sora) కి లైసెన్స్ ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ. 8,300 కోట్ల (1 బిలియన్ డాలర్లు) డీల్ జరిగింది. దీనివల్ల మనకు నచ్చిన డిస్నీ క్యారెక్టర్లతో మనం ఏఐ ద్వారా కొత్త వీడియోలను క్రియేట్ చేసే అవకాశం రాబోతోంది.
చౌకైన టెక్నాలజీ: ఫోటోనిక్ చిప్స్
ఏఐ రన్ అవ్వడానికి విద్యుత్ ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనికి పరిష్కారంగా ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు 'ఫోటోనిక్ ఏఐ చిప్'ను తయారు చేశారు. ఇది విద్యుత్తుకు బదులుగా కాంతిని (Light) వాడుకుని పనిచేస్తుంది. దీనివల్ల ఏఐ ప్రాసెసింగ్ ఖర్చు భారీగా తగ్గనుంది. చైనాకు చెందిన డీప్‌సీక్ కూడా 70 శాతం తక్కువ ఖర్చుతో తన మోడల్స్ ట్రైన్ చేసి అబ్బురపరిచింది.
ఏదేమైనా.. 2025 సంవత్సరం ఏఐ కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదని, అది రోబోల రూపంలో మన ఇంట్లోకి కూడా రాబోతోందని నిరూపించింది. ఎలన్ మస్క్ 'గ్రోక్' (Grok), అమెజాన్ 'నోవా 2.0' వంటి మోడల్స్ కూడా ఈ రేసులో ఉండటంతో 2026 మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications