ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను లేఆప్స్ భయాలు వెంటాడుతున్నాయి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నాయి. మహమ్మారి ముగిసినా కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. దీనికి మళ్లీ కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. వారి జాబ్స్ గాలిలో దీపంలాగా తయ్యారయ్యాయి. కరోనాతో కంపెనీలన్నీ ఆర్థికమాంద్యంలో కూరుకుపోయాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసివేసే ప్రక్రియను ప్రారంభించాయి.
ఆ రంగం..ఈ రంగం అని లేకుండా అన్నిరంగాల్లు ఉద్యోగ తీసివేతలు జరుగుతున్నాయి.2025లో ఈ లేఆప్స్ ఆగుతాయనుకుంటే దూసుకొస్తున్న ఆర్థిక మాంధ్య భయాలు కంపెనీలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా టెక్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. అమెజాన్ మొదలుకుని ఇంటెల్ వరకు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. 2025లో దాదాపు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగ ఏరివేతలు మొదలు పెట్టాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.

సేల్స్ విభాగంలోని ఉద్యోగులను తీసివేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే నెలలో ఈ కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఏఐ రాకతో పెట్టబడులన్నీ దాని మీదకు మళ్లించడంతో కాస్ట్ పెరగింది. ఈ నేపథ్యంలో కాస్ట్ కటింగ్ ప్లాన్ చేస్తోంది దిగ్గజం. ఇందులో భాగంగానే ఉద్యోగ తొలగింపులు చేపడుతోంది. అయితే ఈ తొలగింపులు ఒక్క అమెజాన్ కే పరిమితం కాలేదు. మరో దిగ్గజం ఇంటెల్ వందలాది మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మరో దిగ్గజం క్రౌడ్ స్ట్రైక్ కూడా ఉద్యోగ తొలగింపులు చేపట్టింది.
2025లో ఉద్యోగల తొలగింపులను ఓ సారి పరిశీలిస్తే.. మెజార్టీ ఉద్యోగ తొలగింపులు టాప్ కంపెనీల నుంచే జరిగాయి. టెక్ రంగతో పాటు మీడియా రంగం, అలాగే తయారీ రంగాలు, ఆర్థిక రంగాలతో పాటు రీటైల్ రంగాల్లో ఈ కోతలు జరిగాయి. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య ప్రభావంతో పాటుగా ఉద్యోగుల పని తీరు ఆధారంగా కంపెనీలు ఈ తొలగింపులు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ దిగ్గజం ఇంటెల్ తన వర్క్ ఫోర్సులో 15 నుండి 20 శాతం ఉద్యోగుల తొలగింపులను చేపడుతోంది. ఈ తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇది కంపెనీలో దాదాపు 5 వంతుతో సమానం. అయితే కంపెనీ మరిన్ని పెట్టుబడులతో కంపెనీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీంతో కంపెనీలో పని తీరు కనబరచని ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్‌స్ట్రైక్ కూడా ఈ ఏడాది భారీగా కోతలు మొదలుపెట్టింది.ఏఐ రాకతో ఈ తొలగింపులు చేపడుతోంది. తన కంపెనీలోని ఉద్యోగుల నుంచి దాదాపు 5 శాతం మంది ఉద్యోగులు ఈ కోతల వల్ల ప్రభావితం కానున్నారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా 500 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు రానున్నారు.
ఇక మరో దిగ్గజం ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ ఉద్యోగుల స్థానంలో ఏఐని డెవలప్ చేస్తోంది. దీంతో ఉద్యోగులు అవసరం లేదని చెబుతూ కోతలు స్టార్ట్ చేసింది. రాబోయే కాలంలో అమెజాన్ నుంచి భారీగా లేఆప్స్ ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక జాక్ డోర్సే ఫిన్‌టెక్ కంపెనీ బ్లాక్ కూడా తమ కంపెనీలో ఉద్యోగాల కోత మొదలు పెట్టింది. దాదాపు తమ వర్క్ ఫోర్స్ నుంచి 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మేనేజె మెంట్ రంగంలో 200 మంది,నాన్ మేనేజ్ మెంట్ రంగంలో మరో 800 మంది ఉద్యోగులు ఈ కోతల ద్వారా ప్రభావితం కానున్నారు.
మెటా కూడా లేఆప్స్ షురూ చేసింది. తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. ఫిబ్రవరి నుంచే తొలగింపులు ప్రక్రియ చేపట్టింది. ఫేస్ బుక్, Horizon VR రంగంతో పాటుగా లాజిస్టిక్‌లను నిర్వహించే టీం నుంచి దాదాపు వందలాది మంది ఉద్యోగులను తీస వేసింది. ఇక ఏప్రిల్ నెలలో కూడా మెటా రియాలిటీ విభాగంలో భారీగా తొలగింపులు ప్రక్రియ చేపట్టింది. అయితే ఈ కొతల వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం అయ్యారనే దానిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది మెటా తమ కంపెనీ వర్క్ ఫోర్స్ నుంచి 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
ఇక మరో దిగ్గం అమెజాన్ కూడా ఉద్యోగుల పని తీరును బట్టి కోతలు విధించింది. గేమింగ్ రంగంతో పాటు సేల్స్ విభాగంలోని ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఇక మరో కంపెనీ వాల్మార్ట్ కూడా కంపెనీని విస్తరించే వ్యూహాంలో భాగంగా 1500 మందిని తీసి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీ కూడా దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యభయాలతో కాస్ట్ కటింగ్ ప్లాన్ చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications