Hurun Rich List: హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ గడచిన ఏడాది కాలంలో ఆయన కుటుంబ సంపద పెరిగింది. ఈ కాలంలో అతని నికర విలువ రూ.5,65,503 కోట్లు పెరిగి.. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబ సంపద 95% పెరిగి రూ.11.6 లక్షల కోట్లకు చేరుకుందని నేడు విడుదలైన 2024 హురున్ ఇండియా నివేదిక తెలిపింది. అదానీ సంపదలో చెప్పుకోదగ్గ పెరుగుదలకు గత సంవత్సరంలో వివిధ అదానీ గ్రూప్ సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరగడమే కారణమని చెప్పవచ్చు.
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం బిలియనీర్ల సంఖ్య 300 దాటి 334కి చేరుకుంది. 13 ఏళ్ల క్రితం జాబితాను స్థాపించినప్పటి నుంచి 6 రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. ఇక సంపద పరంగా ముఖేష్ అంబానీ కుటుంబ సంపద 25 శాతం తగ్గి రూ.10.14 లక్షల కోట్లుగా రెండవ స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో నిచిన శివ్ నాడార్ కుటుంబ సంపద 37 శాతం పెరిగి రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. నాలుగో స్థానంలో సైరస్ పి పూనావాలా కుటుంబ సంపద 4 శాతం తగ్గి రూ.2.89 లక్షల కోట్లుగా నమోదైంది. ఐదవ స్థానంలో ఉన్న సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ సంపద 52 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఆరో స్థానంలో ఉన్న కుమార మంగళం బిర్లా సంపద 87 శాతం పెరిగి రూ.2.35 లక్షల కోట్లుగా ఉంది.

మార్కెట్ ఇన్వెస్టర్ డీమార్ట్ అధినత రాధాకిషన్ దమానీ కుటుంబ సంపద రూ.1.90 లక్షల కోట్లు, అజిమ్ ప్రేమ్ జీ కుటుంబ సంపద రూ.1.90 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ కుటుంబ సంపద రూ.1.62 లక్షల కోట్లు, గోపీచంద్ హిందూజా సంపద రూ.1.92 లక్షల కోట్లతో టాప్-10 మంది జాబితాలో నిలిచారు. హురున్ భారతదేశంలోని ధనికుల మొత్తం సంపద రూ. 159 లక్షల కోట్లుగా ఉంది. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ముంబై మెుదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో న్యూదిల్లీ (217), హైదరాబాద్(104) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- లిస్ట్‌లో ఉన్న అతి పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాలో రేజర్‌పే పేమెంట్ సొల్యూషన్స్ యాప్ వ్యవస్థాపకులు హర్షీల్ మాథుర్, శశాంక్ కుమార్ నిలిచారు.
- ఇదే క్రమంలో క్విక్ కామర్స్ జెప్టో వ్యాపారాన్ని స్థాపించిన 21 ఏళ్ల కావల్యా వోహ్రా 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అతి పిన్న వయస్కురాలుగా ఉన్నారు.
- జోహో రాధా వెంబు 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అత్యంత సంపన్న స్వియం నిర్మిత భారతీయ మహిళగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.
- 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 58 ఏళ్ల షారుక్ ఖాన్ భారతీయ సోషల్ మీడియాలో 44.1 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లను కలిగి అగ్రస్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications