Fobes Rich-100: ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అసాధరణంగా ఉన్నప్పటికీ కుబేరుల సంపద మాత్రం పెరుగుతూనే ఉంది. ఫోర్బ్స్ 100 మంది సంపన్నుల ఉమ్మది విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగి మెుత్తం 800 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రూపాయి బలహీనపడుతున్న తరుణంలో కొంత ప్రతికూల వాతావరణం ఉంది.

టాప్-10 బిలియనీర్లు..
తొలి పది మంది సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ రూ.1,211,460.11 కోట్ల సంపదతో మెుదటి స్థానంలో నిలిచారు. 2022లో తొలిసారిగా భారతదేశంలో ధనవంతుల జాబితాలో మెుదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ విలువ రూ.710,723.26 కోట్లుగా ఉంది. 2013 తర్వాత తొలిసారిగా ఆయన రెండవ స్థానానికి దిగజారారు. ఇక మూడవ స్థానంలో DMart రిటైల్ చైన్ అధిపతి రాధాకిషన్ దమానీ రూ.222,908.66 కోట్ల సంపదతో నిలిచారు. ప్రస్తుతం డీమార్ట్ కంపెనీ దేశవ్యాప్తంగా 271 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది.

సైరస్ పూనావాలా..
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరప్ పూనావాలా ఆస్తుల విలువ రూ.173,642.62 కోట్లుగా ఉంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ్ నాడార్ నాలుగో స్థానంలో రూ.172,834.97 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. OP జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ మాత్రమే మహిళా బిలియనీర్ సావిత్రి జిందాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.132,452.97 కోట్లుగా ఉంది.

కుమార మంగళం బిర్లా..
టాప్ పదిమందిలో ఉన్న సన్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ షాంఘ్వీ నికర విలువ 125,184.21 కోట్లుగా ఉంది. ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న హిందూజా బ్రదర్స్ ఆస్తుల విలువ రూ.122,761.29 కోట్లుగా ఉంది. తొమ్మిదో స్థానంలో టెక్స్‌టైల్స్ నుంచి సిమెంట్ వరకు అనేక వ్యాపారాలను కలిగి ఉన్న కుమార మంగళం బిర్లా ఆస్తుల నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం రూ.121,146.01 కోట్లుగా ఉంది. చివరగా బజాజ్ కుటుంబం రూ.117,915.45 కోట్ల ఆస్తులతో పదవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బజాజ్ ఆటో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన తయారీదారులుగా నిలిచింది.

కొత్తగా జాబితాలో తొమ్మిది మంది..
2022 ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా తొమ్మిది మంది చోటు సంపాదించుకున్నారు. ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో ఉండగా.. ఎథ్నిక్ గార్మెంట్ మేకర్ రవి మోదీ 50వ స్థానంలో నిలవగా, మెట్రో బ్రాండ్‌లను లిస్ట్ చేసిన షూ మేకర్ రఫీక్ మాలిక్ 89వ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications