రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జియో సహా తన ఇతర డిజిటల్ సర్వీసులన్నింటినీ ఒకే గొడుగు కిందకి చేర్చనుంది. దీనికోసం రూ.1,08,000 కోట్ల పెట్టుబడితో ఒక పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది.
ఆర్ఐఎల్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఇప్పటికే ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు కూడా అమోద ముద్ర వేసింది. మరోవైపు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్) బోర్డు కూడా దీనిని ఆమోదించింది. ఈ పరిణామం వల్ల రిలయన్స్ జియో నికర రుణ రహిత సంస్థగా ఆవిర్భవించనుంది.

ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం...
డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూపులోని వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తోన్న సేవలన్నీ ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా అందించాలని భావించారు. దీనికోసం ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు (ఓసీపీఎస్) రైట్స్ ఇష్యూ ద్వారా ఈ అనుబంధ సంస్థలో రూ.1,08,000 కోట్ల ఈక్విటీని పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు.

‘జియో' కూడా ఇందులోకే...
టెలికాం మార్కెట్‌లో ప్రత్యర్థి కంపెనీలను హడలగొడుతూ సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్)ను కూడా కొత్తగా ఏర్పాటు చేసే ఈ అనుబంధ సంస్థ కిందికే తీసుకురావాలని ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్‌జేఐఎల్‌లో పెట్టిన రూ.65 వేల కోట్ల ఈక్విటీ కూడా ఈ అనుబంధ సంస్థలోకి మారుతుంది. ఫలితంగా ఈ అనుబంధ సంస్థ మొత్తం మూలధనం విలువ రూ.1,73,000 కోట్లు అవుతుంది.

ఏయే డిజిటల్ సేవలు అందిస్తోందంటే...
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తన వినియోగదారులకు సేవలు అందిస్తోంది. వీటిలో మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో స్నాప్స్ వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, వాణిజ్యం, ప్రభుత్వం పౌరసేవలు, గేమింగ్, తయారీ వంటి పలు రంగాల్లో సేవలు అందించే దిశగా పావులు కదుపుతోంది. దీనికోసం బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతపైనా దృష్టి పెడుతోంది.

రుణ రహిత సంస్థగా ‘జియో'...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ జియో కొత్త అనుబంధ సంస్థలోకి మారడమేకాక.. 2020 మార్చి 31 నాటికి నికర రుణ రహిత సంస్థగా మారుతుంది. అయితే స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలు మాత్రం అలాగే ఉంటాయి. దీనికోసం జియోకి చెందిన రూ.1,08,000 కోట్ల రుణాన్ని ఆర్ఐఎల్‌కు బదిలీ చేసేందుకు డిబెంచర్ హోల్డర్లు సహా రుణదాతలకు.. ఆర్‌జేఐఎల్‌కు మధ్య ఇప్పటికే ఒక అంగీకారం కూడా కుదిరింది. దీనికి ఆర్‌జేఐఎల్ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపింది. రుణ రహిత సంస్థగా జియో మారడం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆర్ఐఎల్ భావిస్తోంది.

కొత్త సంస్థ ఏర్పాటుతో విప్లవాత్మక మార్పులు...
మరోవైపు డిజిటల్ సేవలన్నింటికీ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ ఏర్పాటుకు ఆర్ఐఎల్ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదముద్ర వేసింది. అయితే ఈ సంస్థ ఏర్పాటు రుణ బదిలీ తదితర ప్రతిపాదనలకు సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి ముందుగా అనుమతులు పొందవలసి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు అయ్యే అనుబంధ సంస్థ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే డిజిటల్ సేవల సంస్థగా నిలుస్తుందని, ఇది దేశంలో అసలు సిసలైన డిజిటల్ సమాజ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుందని ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు.

వాటాదారుల పెట్టుబడికి మరింత విలువ...
ఆర్ఐఎల్ కొత్తగా ఏర్పాటు చేయబోయే పూర్తిస్థాయి అనుబంధ సంస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వ్యూహాత్మక పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ తెలియజేశారు. అలాగే డిజిటల్ సేవల కోసం పూర్తిస్థాయి అనుబంధ సంస్థ ఏర్పాటుతో ఆర్ఐఎల్ వాటాదారుల ప్రస్తుతం విలువ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వ్యూహాత్మక పెట్టుబడిదారులను సంస్థ వాటాదార్లకు పరిచయం చేస్తామని ఆయన వివరించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications