For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను చెల్లింపుల ప్రభావం: ఐసీఐసీఐ లాభంలో క్షీణత

|

2019-20 ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 2 (జూలై - సెప్టెంబర్)కు గాను ఐసీఐసీఐ బ్యాంకు ఏకీకృత ప్రాతిపదికన రూ.1,131.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,204.62 కోట్లతో పోలిస్తే 6.9 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం 17.26% వృద్ధితో రూ.31,914.82 కోట్ల నుంచి రూ.37,424.78 కోట్లకు చేరుకుంది. స్టాండలోన్ పద్ధతిలోను నికర లాభం రూ.908.99 కోట్ల నుంచి రూ.654.96 కోట్లకు పరిమితమైంది.

పన్ను చెల్లింపుల కోసం గణనీయంగా రూ.3,020.67 కోట్ల మేర సర్దుబాటు చేయాల్సి రావడం లాభం తగ్గేందుకు కారణమైంది. ఇక స్టాండలోన్ ఆదాయం 24.62% పెరిగి రూ.18,262.12 కోట్ల నుంచి రూ.22,759.52 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగైంది. ఎన్పీఏ (స్థూల నిరర్థక ఆస్తులు) నిష్పత్తి 8.54% శాతం నుంచి 6.37% శాతానికి, నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.65% శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.

ICICI Bank Q2 profit falls 28% YoY to Rs 655 crore

ఎన్పీఐలు రూ.3,100 కోట్ల నుంచి రూ.2,482 కోట్లకు తగ్గాయి. మరోవైపు రిటైల్ రుణాలు క్షీణించాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో రుణాల పంపిణీ నెమ్మదించింది. దీంతో బ్యాంకర్ల వ్యాపారంపై ఉంది. జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌కు గాను ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ (PBT) 247 శాతం పెరిగి రూ.4,367 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,256 కోట్లుగా ఉంది.

English summary

పన్ను చెల్లింపుల ప్రభావం: ఐసీఐసీఐ లాభంలో క్షీణత | ICICI Bank Q2 profit falls 28% YoY to Rs 655 crore

ICICI Bank on Saturday posted a 27.90 per cent year-on-year (YoY) fall in net profit at Rs 654.96 crore for the quarter ended September 2019. It had posted a net profit of Rs 908.88 crore in the same period last year.
Story first published: Sunday, October 27, 2019, 8:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X