ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పేస్ బుక్ లో ఇకపై వార్తలు కూడా చదువుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ 'న్యూస్ ట్యాబ్' పేరుతో సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం అమెరికాలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర దేశాల్లో ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీచర్ లో భాగంగా పేస్ బుక్ లోని ఈ కొత్త ఫీచర్ లో ప్రముఖ పేపర్ల లో ప్రచురితమయ్యే వార్తలను చదివే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు ఒక ప్రధాన హెడ్డింగును పెడతారు. మిగితా వార్తలన్నీ వినియోగదారుల ఇష్టాయిష్టాల మేరకు వరుస క్రమంలో ప్రత్యక్షమవుతాయి. పేస్ బుక్ యూసర్ ఎవరైనా సరే సంబంధిత వార్త ను చదవాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పేస్ బుక్ నుంచి లింక్ నేరుగా వార్త ప్రచురితమైన పబ్లికేషన్ కు రీ-డైరెక్ట్ అవుతుంది. పేస్ బుక్ నెలకొల్పి సుమారు 15 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం ఈ సంస్థ ఎప్పుడు కల్పించ లేదు. అసలు న్యూస్ సబ్జెక్టు ను ఇది అసలు పట్టించుకోలేదు. అందుకే, దీనిని చారిత్రాత్మక సంఘటనగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఒక కథనాన్ని ప్రచురించింది.

దిగ్గజ పత్రికలన్నీ...
అమెరికాలో ప్రచురితం అవుతున్న దిగ్గజ పత్రికలన్ని పేస్ బుక్ ప్రవేశ పెడుతున్న న్యూస్ ట్యాబ్ ఫీచర్ లో అందుబాటులో ఉంటాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్, బిజినెస్ ఇన్సైడర్, యెన్బీసి, యూఎస్ఏ టుడే, బజ్ ఫీడ్ న్యూస్, ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ సహా అన్ని ప్రధాన పత్రికలకు ఇక్కడా చోటు కల్పించనున్నారు. కొందరు జర్నలిస్టులు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను న్యూస్ ట్యాబ్ వాల్ లో ఏ క్రమంలో ఉండాలో నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా అమెరికా లోని ప్రధాన నగరాలకు సంబంధించిన స్థానిక వార్తలకు కూడా పెద్ద పీఠ వేయనున్నారు. అదే సమయంలో చిన్న పట్టణాల సమాచారాన్ని సైతం తగు విధంగా ప్రదర్శించనున్నట్లు పేస్ బుక్ తెలిపింది.

పత్రికలకు కొత్త ఆదాయం...
ఇప్పటి వరకు పేస్ బుక్ లో ప్రచారం చేసుకునేందుకు ఎవరైనా దానికి డబ్బులు చెల్లించాలి. కానీ తొలిసారిగా పేస్ బుక్ తాను ప్రదర్శించే వార్తల కోసం ఆయా పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లించబోతోంది. దీంతో పత్రికలకు సరి కొత్త ఆదయ వనరు ఏర్పడబోతోంది. దాదాపు పేస్ బుక్ ఏర్పడిన నాటి నుంచి అమెరికా లోని పబ్లిషింగ్ హౌస్ లు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. కానీ పేస్ బుక్ ఆ డిమాండ్ ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే, పేస్ బుక్ న్యూస్ ట్యాబ్ ఆలోచనతో ఇప్పుడు వారి డిమాండ్ తీరి నట్టయింది. ఇదిలా ఉండగా, న్యూస్ కంటెంట్ కు డబ్బులు చెల్లించటం ఎంత వరకు సబబో తనకు తెలియదని పేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వ్యాఖ్యానించారు. అయితే, పబ్లిషింగ్ కంపెనీలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కలిగి ఉండాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

పేస్ న్యూస్ కు అడ్డుకట్ట...
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఫేక్ న్యూస్ ఒక వ్యాధి లా ప్రబలుతోంది. సరైన వార్త ఏదో, నకిలీది ఏదో తేల్చుకొనే అవకాశం యూజర్లకు లేకుండా పోతోంది. ఈ మధ్య కాలంలో నేరుగా పత్రికలు చదివే వారికంటే కూడా సోషల్ మీడియా లో వచ్చే వార్తలనే ఫాలో అవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ వార్తలను కట్టడి చేసే బాధ్యతను ఆయా సోషల్ మీడియా యాజమాన్యాల బాధ్యతగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందుకోసం పేస్ బుక్, వాట్సాప్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో పేస్ బుక్ ఇలాంటి కొత్త తరహా వ్యూహాలకు పదును పెడుతున్నట్లు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ కు ఎప్పుడో...
సహజంగానే సోషల్ మీడియా వినియోగం లో ప్రపంచంలోనే భారత్ ముందు వరుసలో ఉంటోంది. ఈ విషయంలో మనం అమెరికా ను కూడా వెనక్కి నెట్టి మరీ రెండో స్థానానికి చేరుకున్నాం. అత్యధిక జనాభా కలిగిన చైనా మాత్రమే మనకంటే ముందు ఉంది. సుమారు 50 కోట్ల మంది మన దేశంలో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇందులో ప్రధానంగా వారు చూస్తున్నది సోషల్ మీడియా కంటెంట్. పేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ కు మన వారు జై కొడుతున్నారు. ప్రకటనల ఆదాయంలోనూ పేస్ బుక్ నకు ఇండియా ప్రధాన మార్కెట్ గా ఆవిర్భవించింది. కాబట్టి, న్యూస్ ట్యాబ్ ఫీచర్ ను త్వరలోనే భారత్ లోనూ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications