స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పండగల సీజన్ నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆకర్షణీయమైన ఆఫర్లను కంపెనీలు ప్రకటించడంతో అమ్మకాలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఇదే విషయం కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడయింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 కోట్ల మొబైల్ ఫోన్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే అమ్మకాల్లో 10 శాతం వృద్ధి నమోదయింది. ఇప్పుడంతా ఎక్కడ చూసినా మందగమనం మాటనే వినబడుతోంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు చూస్తే అదంతా ఉత్తమాటనే అనే విధంగా కనిపిస్తోంది కదా...

కొత్త ఫోన్లు.. ఆఫర్లు
దేశ, విదేశీ కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఇదేసమయంలో అమ్మకాలను పెంచుకోవడానికి డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. దీపావళి నేపథ్యం కూడా ఫోన్ల అమ్మకాలకు కలిసి వచ్చింది. అందుకే జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ రెండంకెల వృద్ధి సాధించింది. విభిన్న రకాల అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ఉపయోగ పడుతోంది. ఫోన్ల ద్వారా డిజిటల్ సమాచార వినియోగం పెరుగుతోంది. ఈ- కామర్సు, కమ్యూనికేషన్ వంటివాటికి వినియోగిస్తున్నారు. అందుకే వినియోగదారులు తమ ఖర్చుల్లో అధిక శాతం స్మార్ట్ ఫోన్ల కోసమే వినియోగిస్తున్నారు.
ఈ- కామర్స్ సైట్ల ద్వారా చిన్న గ్రామాలకు కూడా ఫోన్ల డెలివరీ జరుగుతోంది. దీనికి తోడు కంపెనీల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, నెలవారీ వాయిదాల చెల్లింపుల సదుపాయాలు వంటివి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇవన్నీ అమ్మకాలు వృద్ధి చెందడంతో దోహద పడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నెంబర్ వన్ షామీ
* స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో చైనాకు చెందిన షామీ దుమ్ము రేపుతోంది. సరికొత్త ఫోన్లను తక్కువ ధరల్లోని తెస్తూ ప్రత్యర్థి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.
* కౌంటర్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం షామీ మార్కెట్ వాటా 26 శాతంగా ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న శాంసంగ్ వాటా 20 శాతం, వివో వాటా 17 శాతం, రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా ఉంది.
* కొన్ని మోడళ్ల ధరలు తగ్గించిన నేపథ్యంలో యాపిల్ మొబైల్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీ టాప్ 10 కంపెనీల్లోకి చేరింది.
* నెంబర్ వన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి.

ఫీచర్ ఫోన్ మార్కెట్లో క్షీణత
*స్మార్ట్ ఫోన్ల కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. మూడో త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. రిలయన్స్ జియో తన జియో ఫోన్ ధరను సగానికి సగం తగ్గించింది. దీంతో ఈ ఫోన్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.
ఐ టెల్, లావా, కార్బన్ కంపెనీల అమ్మకాల్లోనూ సానుకూల వృద్ధి నమోదయింది. ఐ టెల్ రెండో స్థానములో నిచ్చింది. ఐ టెల్ అమ్మకాలు 40 శాతం మేర పెరిగాయి.
* ఫీచర్ ఫోన్ విభాగంలో శాంసంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా ఉంది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications