రిలయన్స్ డిజిటల్ పండుగ ఆఫర్: 15% క్యాష్ బ్యాక్, 10% డిస్కౌంట్
ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయించే రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 31 తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌లలో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మరో పది శాతం అదనపు రాయితీని కల్పిస్తోంది.
లక్కీ డ్రా ఉంటుంది. ఇందులో గెలుపొందిన వారు కిలో బంగారాన్ని, లగ్జరీ కార్లు, మోటార్ సైకిల్, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్స్ లేదా ఐఫోన్లు గెలుచుకోవచ్చు. అయితే ఈ లక్కీ డ్రా తమిళనాడుకు మాత్రం వర్తించదు. ఈ మేరకు రిలనయన్స్ డిజిటల్ ప్రకటన చేసింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.

ఈ అద్భుత ఆఫర్లు అన్ని కూడా టెలివిజన్, హోమ్ అప్లియెన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, యాక్సెసరీస్ వంటి అన్ని కేటగిరీలకు వర్తిస్తుంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications