మనదేశంలో స్టాక్ మార్కెట్ల తీరును ఎవరు ఊహించలేక పోతున్నారు. చిన్న ఇన్వెస్టర్ల పరిస్థితి మరీ దీనంగా తయారయింది. మార్కెట్లు నష్టపోయినప్పుడు వీరి కష్టాలు, నష్టాలు వర్ణనాతీతం. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ ప్రయోజనాలు అందుకోలేరు. ఇదీ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రిస్క్ తీసుకోలేక మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ వద్ద ఖాతాలు పెరిగిపోతున్నాయి. వీటినే ఫోలియోలు అంటారు. గత సెప్టెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ 3.45 లక్షల ఫోలియో లను జత చేసుకోవడంతో వీటి సంఖ్య 8.56 కోట్లకు ఎగబాకింది. అంతకు ముందు నెలలో కన్నా ఈ సంఖ్య తక్కువగానే ఉంది. గత ఆగస్టు లో 4.8 లక్షలు, జులై నెలలో 10 లక్షలకు పైగా ఫోలియోలను పరిశ్రమ జత చేసుకోగలిగింది. ఫోలియోలను ఇన్వెస్టర్ల ఖాతాలకు కేటాయిస్తుంటారు. ఒక ఇన్వెస్టర్ వివిధ ఫోలియోలను కలిగి ఉండవచ్చు.
44 మ్యూచువల్ ఫండ్ సంస్థలు
* ప్రస్తుతం మన దేశంలో 44 మ్యూచువల్ ఫండ్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికీ వీటి వద్ద ఫోలియో ల సంఖ్య 8,56,26,244కు చేరుకుంది.
* అంతకు ముందు ఆగస్టు నెలలో వీటి సంఖ్య 8,52,81,222 గా ఉంది. జులైలో 8.48 కోట్లు, జూన్ లో 8.38 కోట్లు, మే నెలలో 8.32 కోట్లు, ఏప్రిల్ లో 8.27 కోట్లు గా ఫోలియోల సంఖ్య ఉన్నది. మార్కెట్లలో నెలకొంటున్న హెచ్చు తగ్గులు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.

ఇదీ స్కీమ్స్ తీరు..
* సెప్టెంబర్ నెలలో బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 3.6 శాతం పెరిగింది. ఇదే నెలలో ఈక్విటీ, ఈక్విటీ అనుసంధాన సేవింగ్ స్కీమ్స్ ఫోలియో లు 2 లక్షలు పెరిగి 6.18 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు నెలలో వీటి సంఖ్య 6.16 కోట్లుగా ఉంది.
* డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్ ఫోలియో లు 92,000 కు పైగా పెరిగి 67.67 లక్షలకు చేరుకున్నాయి.
* డెట్ కేటగిరీలో లిక్విడ్ ఫండ్స్ ముందున్నాయి. వీటి ఫోలియో లు 17 లక్షలుగా ఉన్నాయి. తక్కువ కాల పరిమితి ఫండ్ ఫోలియో లు 9.25 లక్షలు న్నాయి.
రూ. 1.52 లక్షల కోట్ల ఉపసంహరణ
* గత నెలలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి 1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలంలో 1.02 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్ నుంచి పెట్టుబడులు తరలి పోయాయి. ఈ మొత్తం రూ.1.58 లక్షల కోట్లుగా ఉంది.
* ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి దాదాపు రూ.6,489 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈ స్థాయిలో ఎప్పుడు పెట్టుబడులు లేవు. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ నెలకొంది. ఇదే అవకాశంగా భావించిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు.
* పెట్టుబడులు తరలిపోయిన ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు సెప్టెంబర్ చివరినాటికి 4 శాతం తగ్గి 25.47 లక్షల కోట్ల నుంచి 24.51 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications