జపాన్ కు చెందిన ప్రముఖ కార్లు, మోటార్ సైకిల్స్ తయారు చేసే దిగ్గజ కంపెనీ హోండా.... ఇండియా లో ఒక కార్ల తయారీ ప్లాంటును మూసివేయాలని భావిస్తోంది. గత నాలుగేళ్లుగా కంపెనీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. తాజాగా దీనికి భారత్ లో నెలకొన్న ఆర్థిక మాంద్యం తోడయ్యింది. దీంతో మొత్తంగా సుమారు 50% కార్ల అమ్మకాలు క్షీణించాయి. ఏడాది లో కంపెనీ విక్రయించిన కార్ల సంఖ్య కేవలం 60,000 కు పడిపోయింది. దీంతో పూర్తిగా భారత కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక ప్లాంటును మూసివేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం గ్రేటర్ నోయిడా లోని తన ప్లాంటు లో ఉత్పత్తి ని పూర్తిగా రాజస్థాన్లోని మరో ప్లాంటుకు తరలించే యోచనలో ఉంది. అలాగే, ఐదేళ్ల క్రితం గుజరాత్ లో ఒక ప్లాంటు నెలకొల్పేందుకు కొనుగోలు చేసిన భూమిని కూడా విక్రయించాలని నిర్ణయించింది. దేశంలో కార్ల అమ్మకాలు నెమ్మదించటంతో వ్యయాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ మేరకు కంపెనీ పలు కీలక వ్యూహాలను అమలు చేస్తోంది.

మూసివేత దిశగా తొలి ప్లాంటు...
హోండా కార్స్... దేశం లో తన మొట్ట మొదటి తయారీ ప్లాంటును గ్రేటర్ నోయిడా లో ఏర్పాటు చేసింది. ఇందులో ఏటా 1,20,000 కార్లను ఉత్పత్తి చేసేది. అయితే, ప్రస్తుత పరిణామాల మధ్య ఉత్పత్తి వినియోగం కేవలం 20-30% నికి పడిపోయింది. ఇక్కడ నెలకు కేవలం 2,500 యూనిట్ల కార్లను మాత్రమే తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాంటు కార్యకలాపాలను రాజస్థాన్ ప్లాంటుకు తరలించాలని నిర్ణయించింది. దీంతో ఈ ప్లాంటు ను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ ) కేంద్రంగా మార్చనుందని సమాచారం.

అది కూడా ఒక కారణమే...
ఆర్థిక మాంద్యానికి తోడు కంపెనీకి మరో ఇబ్బంది కూడా తలెత్తింది. గ్రేటర్ నోయిడా ప్రాంతం రోజు రోజుకు నివాస ప్రాంతంగా పరిణామం చెందుతోంది. దీంతో ప్లాంటు కార్యకలాపాలు భవిష్యత్ లో ఎలాగూ ప్రభావితం అవుతాయి. అదే సమయంలో కంపెనీ ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను ప్రయోజనాలు కూడా ఇక మీదట వర్తించవు. దీంతో ప్లాంటును తరలించటమే సరైన నిర్ణయంగా కంపెనీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కారణాలు కొంత వరకు నిజమే అయినా.. అమ్మకాల తరుగుల వల్లే అసలు సమస్య తలెత్తినట్లు భావిస్తున్నారు.

4-5 ఏళ్లుగా నెమ్మదిగానే
హోండా కార్ల తయారీ కంపెనీ భారత మార్కెట్ పై భారీ ఆశలతో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు రచించింది. 2010 నుంచి 2015 మధ్య దేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ పెట్టుబడులు కూడా పెట్టింది. అయితే, గత 4-5 ఏళ్లుగా కార్ల అమ్మకాలు ఆశించిన మేరకు జరగలేదు. కార్ల అమ్మకాల్లో సగటున కేవలం 5% కంటే కూడా తక్కువ వృద్ధి నమోదు అయ్యింది. దీంతో వెంటనే దేశంలో కార్ల డీలర్ల సంఖ్యను పెంచలేదు. సర్వీస్ సెంటర్లు పెరగలేదు. పైగా ఏడాది కాలం నుంచి భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. నెల నెలకూ అమ్మకాలు తగ్గుతున్నాయి. ఇది కేవలం ఒక్క కార్ల కు మాత్రమే పరిమితం కాలేదు. ద్వి చక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, బస్సులు, ట్రక్కులు ఇలా అన్ని రకాల వాహనాల అమ్మకాలు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో హోండా భారత్ లో తన దీర్ఘ కాళిక ప్రణాళికలను పూర్తిగా మార్చబోతోంది. కొత్త వ్యూహాలను అమలు చేయబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications