బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొద్ది నెలల్లోనే రూ.33 వేల నుంచి రూ.39 వేలు, రూ.40 వేలకు చేరుకుంది. అయినప్పటికీ పండుగ సీజన్లో పసిడి కొనుగోళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీపావళి పండుగకు ముందు వచ్చే ధన త్రయోదశి నాడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి పూజిస్తుంటారు. ఈసారి ధరలు బాగా పెరిగాయి. దీంతో పసిడి కొనుగోళ్లు తగ్గుతాయని అంచనా. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరీ ఛార్జీలలో రాయితీలు, పాత ఆభరణాల మార్పిడి, ఉచిత బహుమతులు వంటివి ఆఫర్ చేస్తున్నారు.

పసిడిపై గిఫ్ట్స్..
గత ఏడాది దీపావళి సమయంలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.32,000 నుంచి రూ.33,000 మధ్య ఉండగా ఇప్పుడు రూ.39,000 వరకు ఉంది. సాధారణంగా ఏవైనా గృహోపకరణాలు వంటివి కొనుగోలు చేసినప్పుడు బంగారు నాణెం గిఫ్టుగా ఇస్తుంటారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఈసారి పసిడి ఆభరణాల కొనుగోలుపై ఎలక్ట్రానిక్ వస్తువులు పొందవచ్చు.

తరుగు, మజూరీ..
పాత ఆభరణాలు తీసుకెళ్తే, కొత్త అభరణాలు ఇస్తామని చెబుతుంటారు. మనం ఇచ్చిన బరువుకు సమానమైన ఆభరణం తీసుకు వెళ్లినా తరుగు, మజూరీ వంటి ఛార్జీలు ఉంటాయి. వీటిని మాత్రం వసూలు చేస్తారు. తరుగు కింద ఆభరణం డిజైన్‌ను బట్టి అధికంగా ముప్పై శాతం వరకు ఉంటుంది. ప్రతి పది గ్రాములకు ఆ మేరకు డబ్బులు చెల్లించాలి. పది శాతం తరుగు తీసుకున్నా పది గ్రాముల బంగారంపై దాదాపు రూ.4వేల వరకు అదనంగా చెల్లించవలసి వస్తుంది. పది శాతం కంటే ఎక్కువ తీసుకుంటే దానిని బట్టి పెరుగుతుంది.

ఫ్లాట్‌గా బంగారం ధరలు
ఇదిలా ఉండగా, బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగింది. పవిత్రమైన ఈ ధన్‌తెరాస్ రోజున గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్‌లో బంగారం అక్టోబర్ 24న రూ.38,352 కాగా, ఈ రోజు (అక్టోబర్ 25) రూ.23 తగ్గి రూ.39,329గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications