తెలంగాణలో సంతూర్ సబ్బుల తయారీ... ఎప్పటి నుంచో తెలుసా?
సంతూర్ సబ్బుతో పలు రకాల పర్సనల్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్న విప్రో కన్జ్యూమర్ కేర్ కంపెనీ తెలంగాణలోని హైదరాబాద్ శివారులో తన ప్లాంటును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. దీని కోసం 220 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ ఇంతకు ముందే ప్రకటించింది. ఈ ప్లాంట్ 40 ఎకరాల విస్తీర్ణం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీకి ఇప్పటికే ఏడూ ప్లాంట్లున్నాయి. హైద్రాబాద్ శివారులో ఏర్పాటు చేస్తున్న ప్లాంటును వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ప్రారంభించనున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ చూగ్ వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలోనే 38 శాతం వ్యాపారం
* విప్రో తన సబ్బుల వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్ల వాటానే 38 శాతం ఉంది. ఇది మామూలు విషయం ఏమీ కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ మార్కెట్లకు దగ్గరగా తన ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది.

* ప్రస్తుతం బెంగళూరు లోని తుంకూర్ లో ఉన్న ప్లాంట్ లో తయారవుతున్న సబ్బులను తెలుగు రాష్ట్రాల మార్కెట్లలోకి కంపెనీ సరఫరా చేస్తోంది.
* ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉన్నందువల్ల ప్రచారాన్ని మరింతగా పెంచుతోంది. సంతూర్ సబ్బులు టాలీవుడ్ హీరో మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నది.
* కంపెనీ రాబడిలో సగం వాటా గ్రామీణ మార్కెట్లదేనట. దేశ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం మూలంగా కంపెనీ వ్యాపారంపై దెబ్బ పడింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం.
* పరిశ్రమ మార్కెట్ వాటాలో పట్టణ, గ్రామీణ మార్కెట్ల నిష్పత్తి 74:36గా ఉంటే.. సంతూర్ విషయంలో మాత్రం ఇది 50:50గా ఉందట.
* మార్కెట్లో పోటీ బాగా పెరిగిపోతోంది. కాబట్టి కంపెనీలు సబ్బుల ధరలను కాస్త తగ్గించాయి. వీటి బాటలోనే సంతూర్ సబ్బు ధరలను కూడా తగ్గించారు.
* విప్రో కన్స్యూమర్ కేర్ సబ్బుల వ్యాపారంలో సంతూర్ బ్రాండ్ కీలకంగా ఉంది. ఇది 2,000 కోట్ల అమ్మకాల మైలు రాయిని దాటేసినట్టు కంపెనీ చెబుతోంది.
గ్రామీణ మార్కెట్ పై ఆశలు
వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసిన నేపథ్యంలో రానున్న కాలంలో గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు పెరుగుతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. అంతే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను పెంచడం కూడా గ్రామీణ మార్కెట్ డిమాండ్ ను పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications