For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.35 నిమిషాలకు సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో ట్రేడ్ అయింది. సాయంత్రం గం.3.40 సమయానికి సెన్సెక్స్ 38.44 (0.098%) పాయింట్లు నష్టపోయి 39,020.39 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 21.50 (0.19%) పాయింట్లు నష్టపోయి 11,582.60 వద్ద ట్రేడ్ అయింది.

రెండు రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పటికీ, హర్యానాలో హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఉదయం రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ఉంటుందని భావించడంతో మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైనట్లుగా ఉంది. కానీ ఆ తర్వాత ట్రెండ్స్ మారిపోయాయి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Sensex closes above 39,000, Nifty below 11,600

టాప్ గెయినర్స్‌లో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఐచర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ కంపెనీ ఉండగా, టాప్ లూజర్స్‌లో భారతీ ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, గ్రాసిమ్, ఎస్బీఐ, గెయిల్ ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి.

బోనస్ షేర్ 1:1, మధ్యంతర డివిడెండ్ 100%బోనస్ షేర్ 1:1, మధ్యంతర డివిడెండ్ 100%

మిడ్ క్యాప్ సూచీ 0.2 శాతం, స్మాల్ క్యాప్సూచీ 0.01 శాతం పడిపోయాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆరు శాతం లాభపడింది. కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో ట్రేడ్ అయింది. లైఫ్ టైమ్ హైలో ఈ షేర్ ట్రేడ్ అవుతోంది. భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు ఐధు శాతం వరకు నష్టపోయాయి.

English summary

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex closes above 39,000, Nifty below 11,600

Sensex closed lower by 38.44 points or 0.10 percent at 39020.39, and the Nifty ended 21.50 points in the red at 11582.60. About 1070 shares have advanced, 1367 shares declined, and 160 shares are unchanged. Among the sectors, PSU Banks dragged the most while Bharti Airtel and Reliance Industries were the top gainers.
Story first published: Thursday, October 24, 2019, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X