For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి గిఫ్ట్: SBI ఉద్యోగులకు రూ.25.7 కోట్ల స్వీట్స్, చాక్లెట్స్! తొలిసారి OBC బహుమతులు

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC) వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకు (PSB) దీపావళి పండుగ సందర్భంగా తమ ఉద్యోగులకు ఫెస్టివెల్ గిఫ్ట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఈ రెండు బ్యాంకులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.1,000 విలువ కలిగిన మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఇస్తున్నట్లు తెలిపాయి. దీపావళి పండుగ బహుమతిగా ఉద్యోగుల చేతికి డబ్బులు ఇవ్వవద్దని, పైవాటిలో ఏవైనా ఇవ్వవచ్చునని సూచించాయి.

బ్యాంకుల్లోని కాంపిటెంట్ అథారిటీ ఇప్పటికే దీపావళి గిఫ్ట్‌ల డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన నిబంధనలను జారీ చేసింది. స్వీట్స్, డ్రైఫ్రూట్స్, చాక్లెట్స్ రూపంలో అందించే ఈ గిఫ్ట్‌ల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రూ.2019-20 స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్, సంబంధిత బ్యాంకు అకౌంట్స్ నుంచి కట్ చేస్తారు.

SBI, OBC plan Diwali gifts after improved performance

OBC జనరల్ మేనేజర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ స్వరూప్ కుమార్ సాహా మాట్లాడుతూ 2019-20 రెండో త్రైమాసికంలో బ్యాంకు మెరుగైన పని తీరు కనబరిచిందన్నారు. ఓబీసీ రూ.126 కోట్ల నికర లాభం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23.53 శాతం పెరుగుదల నమోదయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 20.99 శాతం పెరిగింది. ఓబీసీ ఉద్యోగులకు దీపావళి బహుమతులు అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్

మరోవైపు, SBI తన ఉద్యోగులకు రెండోసారి దీపావళి సందర్భంగా గిఫ్ట్స్ ఇస్తోంది. ఎస్బీఐలో 2,57,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ గిఫ్ట్‌ల విలువ రూ.25.7 కోట్లు కానుంది.

English summary

దీపావళి గిఫ్ట్: SBI ఉద్యోగులకు రూ.25.7 కోట్ల స్వీట్స్, చాక్లెట్స్! తొలిసారి OBC బహుమతులు | SBI, OBC plan Diwali gifts after improved performance

Public sector banks (PSBs) here like the State Bank of India (SBI) and the Oriental Bank of Commerce (OBC) are planning to give festival gifts to their employees.
Story first published: Thursday, October 24, 2019, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X