దీపావళి పండుగ సమీపిస్తోంది. దానికి రెండు రోజుల ముందు వచ్చే 'ధన్‌తేరాస్' సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. మరి మీరు రెడీగా ఉంటే బ్రహ్మాండమైన ఆఫర్ మీకోసం సిద్ధంగా ఉంది. అదేమిటంటే.. గ్రాము బంగారానికి మరో గ్రాము ఉచితం.
ఆశ్చర్యంగా ఉందా? అబ్బ.. ఈ ఆఫర్ అదుర్స్ అనిపిస్తోందా? అవును మరి, ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ 'మొబిక్విక్' తాజాగా ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌పామ్ 'సేఫ్‌గోల్డ్' సంస్థతో జతకట్టింది.

ఈ పండుగ సీజన్ కోసం...
ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారికోసం మొబిక్విక్ ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్ ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలు కోసం 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ను మార్చుకుంటే.. వారికి 1 గ్రాము డిజిటల్ గోల్డ్ తిరిగి ఇస్తోంది. ఇది ‘సేఫ్‌గోల్డ్' అకౌంట్‌లో జమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

గతంలో అలా.. ఇప్పుడు ఇలా...
బంగారం కొనుగోలుకు భారతీయులు ఎప్పుడూ మక్కువే చూపుతారు. పండుగలు, పర్వదినాల్లో అయితే బంగారానికి డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. ధర ఎంతన్నది కూడా చూసుకోరు. కొనాలనుకుంటే.. కొని తీరాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే మొబిక్విక్ గతంలోనే డిజిటల్ గోల్డ్ సర్వీసులు లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇక ఇప్పుడేమో దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆఫర్ పరిమిత కాలానికే...
మొబిక్విక్ యాప్ ద్వారా 99.5 ప్యూరిటీ, 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.. లేదా విక్రయించ వచ్చు. ఇక్కడ రూపాయికి కూడా బంగారం కొనొచ్చు. అలాగే డిజిటల్ గోల్డ్‌ను నాణేల రూపంలోకి మార్చుకోవచ్చు. ఇక మొబిక్విక్ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్.. పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అక్టోబర్ 23 నుంచి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ బంగారం కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని ‘మొబిక్విక్' ప్రకటించింది.

మొబిక్విక్ యాప్ ద్వారా...
మొబిక్విక్ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత అది మొబిక్విక్ గోల్డ్ అకౌంట్‌కు వచ్చి యాడ్ అవుతుంది. అలాగే మొబిక్విక్ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మళ్లీ ఫిజికల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుగోలుదారులు తమ ఇంటికి కూడా డెలివరీ చేయించుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications