ముంబై: ఇన్ఫోస్స్ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. సీఈవో, సీఎఫ్ఓలపై గుర్తు తెలియని ఉద్యోగుల సంచలన ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫీ షేర్లు 16 శాతానికి పైగా నష్టపోయాయి. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇన్ఫీ ఇష్యూ నేపథ్యంలో భారత అతిపెద్ద సాఫ్టువేర్ దిగ్గజమైన టీసీఎస్ ప్రత్యర్థి కంపెనీపై ఆధిక్యాన్ని మరింతగా కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఇన్ఫీ షేర్లతో పోలిస్తే టీసీఎస్ షేర్లు సురక్షితంగా భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. సమీప భవిష్యత్తులో ఇన్ఫోసిస్‌కు ఇబ్బందిక పరిణామమని, ఇది టీసీఎస్‌కు లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారు. ఇన్ఫీ అంశంపై స్పష్టత వచ్చే వరకు టీసీఎస్ లాభపడుతుందంటున్నారు. ఇన్వెస్టర్లు టీసీఎస్ చూస్తారని అంటున్నారు.

ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం 16.2 శాతం తగ్గగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 7 శాతం క్షీణించింది. అయితే టీసీఎస్ షేర్ మాత్రం కేవలం 0.3 శాతం రూ.2051.6 వద్ద ఉంది. టెక్నాలజీ షేర్ ఇండెక్స్ 7 శాతం క్షీణిస్తే టీసీఎస్ షేర్లు మాత్రం దాదాపు స్థిరంగా ఉండటం గమనార్హం. బుధవారం టీసీఎస్ షేర్ దాదాపు 9 శాతం పెరిగి 2061గా ఉంది. ఇన్ఫోసిస్ షేర్లు కూడా కాస్త లాభపడ్డాయి. ఇవి 8 శాతం లాభపడి రూ.651 వద్ద ఉంది.
ఇన్ఫోసిస్ సీఈవోపై ఫిర్యాదు, ఏం జరుగుతోంది?
గత కొద్ది నెలలుగా ఇన్ఫోసిస్ మెరుగుపడుతూ టీసీఎస్‌కు సమీపానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ గత కొన్ని నెలలుగా కొత్త నిర్వహణ నియామకం అనంతరం వ్యాల్యుయేషన్ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫోసిస్ పరిణామం టీసీఎస్‌కు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications