For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, మన వద్ద తగ్గుదల

|

వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు బుధవారం (అక్టోబర్ 23) కాస్త తగ్గాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.42 శాతం పెరిగి రూ.38,040కి చేరుకుంది. కిలో వెండి ధర ఎంసీఎక్స్‌లో 0.46 శాతం పెరిగి రూ.45,382గా ఉంది. ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి 1,489.07 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 0.2 శాతం పెరిగి 17.49 డాలర్లుగా ఉంది. అమెరికా, చైనా వాణిజ్య చర్చలపై పురోగతి, బ్రెగ్జిట్ అనిశ్చితి వీడుతున్నందున బంగారంపై ఈ ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు రికార్డ్ హైకి చేరుకున్న ధరతో పోలిస్తే ఇప్పుడు రూ.2,000 తగ్గింది.

నవంబర్ 1 నుంచి జగన్ కొత్త సంస్కరణ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలివీ..నవంబర్ 1 నుంచి జగన్ కొత్త సంస్కరణ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలివీ..

ఆర్థిక అనిశ్చితుల పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడిని అందరూ స్వర్గదామంగా భావిస్తారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఈ నెలాఖరులో ఫెడ్ రేటును తగ్గిస్తుందనే అంచనాలు బంగారం ధరలపై పడిందని చెబుతున్నారు. మిక్స్‌డ్ ఎకనామిక్ డేటా, గ్లోబల్ ఎకనమిక్ అస్థిరతతో పాటు యూఎస్ ఫెడ్ రేట్ కట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల మిశ్రమ ఆర్థిక డేటా, హాంకాంగ్ నిరసనలపై అమెరికా-చైనా మధ్య టెన్షన్స్, మధ్యప్రాచ్యంలోని ఇరాక్‌లో నిరసనలు, టర్కీ-సిరియా టెన్షన్స్ వంటి ప్రభావం బంగారంపై ఉంటుందని చెబుతున్నారు.

 Gold prices surge today but still down ₹2,000 from last months highs

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెడ్ ఉన్నప్పటికీ దేశీయ జ్యువెల్లర్స్, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించింది. దీంతో బంగారం ధరపై మన వద్ద ప్రతికూల ప్రభావం పడింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మధ్యాహ్నం సమయానికి రూ.39,590గా ఉంది.

English summary

అక్కడ స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, మన వద్ద తగ్గుదల | Gold prices surge today but still down ₹2,000 from last month's highs

Gold prices in India rebounded today after falling for three days in a row. On MCX, gold futures prices rose 0.42% to ₹38,040 per 10 gram. Silver futures on MCX rose 0.46% to ₹45,382 per kg. In global markets, gold prices remained muted with spot gold up 0.1% at $1,489.07 per ounce.
Story first published: Wednesday, October 23, 2019, 14:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X