ఇటాలియన్ మోటార్ సైకిల్ దిగ్గజం బెనెల్లి సరికొత్త మోడల్ ద్విచక్ర వాహనాన్ని భారత్‌లో విడుదల చేసింది. బెనెల్లి ఇంపీరీయల్ 400 పేరుతో దీనిని రిలీజ్ చేసింది. దీని ధర రూ.1.69 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది. క్లాసిక్ వేరియంట్స్‌ల్లో బెనెల్లి నుంచి వచ్చిన తొలి బైక్ ఇది. ఎరుపు, సిల్వర్, నలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. 1950లలో బెనెల్లి నుంచి ఉత్పత్తి చేసిన మోటోబి మోడల్ స్ఫూర్తితో దీనిని రూపొందించారు.

రూ.4,000 టోకెన్ ధర చెల్లించి బుక్ చేసుకోవచ్చు..
రూ.4 వేలు టోకెన్ ధర చెల్లించి బెనెల్లి ఇండియా, బెనెల్లీ కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. బైకు తిరిగిన కిలో మీటర్లతో సంబంధం లేకుండా మూడేళ్ల పాటు అఫరిమిత వారెంటీ ఇస్తోంది బెనెల్లీ ఇండియా. తొలి రెండేళ్లు కాంప్లిమెంటరీ సర్వీసు అందిస్తుంది. దీంతో పాటు రెండేళ్లు పూర్తయిన అనంతరం వార్షిక నిర్వహణ, కాంట్రాక్టు కింద సేవలు అందిస్తుంది. బెనెల్లీ ఇంపీరియల్ 400 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా స్టాండర్డ్ బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

399 సీసీ ఎస్ఓహెచ్‌సీ
బెనెల్లి ఇంపీరియల్ 400లో 399 సీసీ ఎస్ఓహెచ్‌సీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, బీఎస్ 4 ఇంజిన్ అమర్చారు. ఇది 5500 ఆర్పీఎం వద్ద 20 బీహెచ్‌పీ శక్తిని, 4500 ఆర్పీఎం వద్ద 29 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.

స్ల్పిట్ సీట్లు...
ముందు భాగంలో 300 ఎంఎం డిస్క్ బాక్స్, వెనుక భాగంలో 240 ఎంఎం డిస్క్ బాక్సు అమర్చారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తున్నారు. రౌండ్ హెడ్ ల్యాంప్, క్రోమ్ ఫినిష్ మిర్రర్స్, స్ప్లిట్ ఎనలాగ్ మీటర్, స్పిల్ట్ సీట్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. ముందు 19 అంగుళాల టైర్, వెనుక 18 అంగుళాల టైరుతో పాటు పీనట్ షేప్ ప్యూయల్ ట్యాంకు, ఆకర్షణీయ స్ప్లిట్ సీటు సెటప్ ఉంది.

మరింత విస్తరణ
గత రెండు నెలలుగా భారత మార్కెట్లోకి వరుస ఉత్పత్తులను విడుదల చేయడం ఆనందంగా ఉందని, ఇది భారత్ పట్ల బెనెల్లి నిబద్దతకు నిదర్శనమని, ఇంపీరియల్ 400 విడుదల పట్ల తాము ఎంతో నమ్మకంగా ఉన్నామని, భారత్‌లో తాము మరింత విస్తరించేందుకు ఇది తోడ్పడుతుందని బెనెల్లీ ఇండియా ఎండీ వికాస్ జాబాక్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications