వాషింగ్టన్: క్రిప్టో కరెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఫేస్‌బుక్ ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ లిబ్రాపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. క్రిప్టో కరెన్సీల విషయంలో చాలా దేశాలు జాగ్రత్తగా ఉంటున్నాయని వెల్లడించారు. భారత్‌లో క్రిప్టో కరెన్సీల ఉపయోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో క్రిప్టో కరెన్సీ అంశంపై ఆర్బీఐదే తుది నిర్ణయమని చెప్పారు.
కాగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీని ప్రారంభించిన విషయం తెలిసిందే. లిబ్రా పేరుతో డిజిటల్ కరెన్సీ సేవలను ప్రారంభించేందుకు అడుగు ముందుకు వేసింది. ఈ డిజిటల్ కరెన్సీపై పలు అమెరికా ఆర్థిక సంస్థలు, రాజకీయనేతలు విమర్శలు సంధించినప్పటికీ ఇవేమీ పట్టించుకోలేదు. జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వేతర సంస్థ లిబ్రా అసోసియేషన్ ఫేస్‌బుక్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒక దేశం నుంచి మరో దేశంలో ఉన్నవారికి నగదు బదిలీ చేసేందుకు ఫేస్‌బుక్ ప్రయివేటు కరెన్సీ సిస్టంను తీసుకు వస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా చేస్తే ఫేస్‌బుక్‌లోని వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లిబ్రా చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళనలు వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ విమర్శల్లో పసలేదని కొట్టి పారేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications