న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 383 శాతం పెరిగాయి. దేశంలో ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. గార్డెన్ సిటీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, పుణే ఉన్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నట్లు రేజర్ పే అనే నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలవారీగా తెలంగాణ 5వ స్థానంలో ఉంది.

రోజు రోజు పెరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్
క్రెడిట్ కార్డు వినియోగంతో పోలిస్తే యూపీఐ ఆధారిత ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు రేజర్ పే నివేదిక తెలిపింది. బిజినెస్ సంస్థలకు డిజిటల్ చెల్లింపుల సేవలన్ని అందించే ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు ఓసారి రిపోర్ట్ తయారు చేస్తుంది. దేశవ్యాప్తంగా 6,00,000 వ్యాపార సంస్థలకు ఇది సేవలు అందిస్తోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నట్లు ఈ సంస్థ రిపోర్ట్ తెలిపింది.

తగ్గిన కార్డు వినియోగం... గూగుల్ పే, ఫోన్ పే హవా
జనవరి 2019 నుంచి సెప్టెంబర్ 2019 మధ్య UPI, నెట్ బ్యాంకింగ్ వరుసగా 222 శాతం, 19 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో కార్డుల వినియోగం 9 శాతం తగ్గడం గమనార్హం. UPI విభాగంలో గూగుల్ పేను 62 శాతం మంది, ఫోన్ పేను 25 శాతం మంది, పేటీఎంను 6 శాతం మంది, భీమ్‌ను 5 శాతం మంది వినియోగిస్తున్నారు. వాలెట్ల విభాగంలో మొదటి త్రైమాసికంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ పే రెండో త్రైమాసికంలో 234 శాతం వృద్ధితో తొలి స్థానానికి చేరుకుంది.

నగరంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుదల ఇలా...
డిజిటల్ పేమెంట్స్‌లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. నగరవాసులు ఆన్‌లైన్ చెల్లింపులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక సేవలు, ఆహారోత్పత్తులు, కూల్ డ్రింక్స్ తదితర ఏ కొనుగోళ్లపై అయినా ఎక్కువగా నగదురహితంగా జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో ఈ టాప్ 3 రంగాల్లో దాదాపు 51 శాతం వృద్ధి నమోదయింది. ఆర్థిక సేవల్లో 22 శాతం, ఆహారోత్పత్తులు, డ్రింక్స్ కొనుగోళ్లలో 18 శాతం, ఇతర సేవల చెల్లింపులో 10 శాతం మేర ఆన్ లైన్ చెల్లింపులు పెరిగాయి. నగరంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 58 శాతం వృద్ధి చెందాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు UPI ట్రాన్సాక్షన్స్ 142 శాతం పెరిగిందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో చూస్తే రెండో త్రైమాసికంలో హైదరాబాద్ డిజిటల్ పేమెంట్ లావాదేవీలు 9% పెరిగినట్లు తెలిపింది.

అక్కడ కార్డులదే హవా... దూసుకెళ్తున్న ఫోన్ పే
హైదరాబాద్ షాపింగ్ మాల్స్‌లలో కార్డులదే హవా. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జూలై - సెప్టెంబర్ కాలంలో వ్యక్తి నుంచి వ్యాపారికి చెల్లింపుల విభాగంలో 41 సాతం వాటా కార్డులది. ఆ తర్వాత యూపీఐ చెల్లింపులు 39 శాతం, నెట్ బ్యాంకింగ్ 18 శాతం ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ - జూన్ త్రైమాసికంతో పోలిస్తే కార్డు లావాదేవీలు 11 శాతం పడిపోగా, యూపీఏ లావాదేవీలు 58 శాతం పెరిగాయి. యూపీఐ చెల్లింపుల్లో గూగుల్ పే ముందుంది. గూగుల్ పే 59 శాతం, ఫోన్ పే 32 శాతం ఉంది. అయితే ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌లో ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ 84 శాతం పెరిగాయి.

ఏపీలో మొత్తం 3000 సంస్థలు
తెలంగాణలో రేజర్ పే ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో వరుసగా, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3000 సంస్థలు తమ సేవల్ని వినియోగించుకుంటున్నట్లు రేజర్ పే సహ వ్యవస్థాపకులు శశాంక్ కుమార్ తెలిపారు.

ఇది రేజరే పే
ఐఆర్‌సీటీసీ, ఎయిర్ టెల్, బుక్ మైషో వంటి ఆరు లక్షల చిన్న, పెద్ద వ్యాపార సంస్థలకు రేజర్ పే టెక్నాలజీ పేమెంట్ సొల్యూషన్లను అందిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని 10 లక్షల వ్యాపారాలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో 2022 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50% మంది డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశముందన్నారు. డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాలని, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీల మధ్య సహకారం ఉండాలన్నారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications