ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి నిఫ్టీ 11,450కు పైగా ఉంది. సెన్సెక్స్ 108.39 పాయింట్లు ఎగిసి 38614.48 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 34.70 పాయింట్లు పెరిగి 11463 వద్ద ఉంది. 393 షేర్లు లాభాల్లో ఉండగా, 174 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 35 షేర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఐవోసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్ట్నైన్మెంట్, బీపీసీఎల్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో ట్రేడ్ కాగా, ఇన్ఫోసిస్, ఐడీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
తొమ్మిదిన్నర గంటల సమయానికి టాప్ టాప్ గెయినర్స్‌లో బీపీసీఎల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, జీ ఎంటర్ట్నైమ్మెంట్, టాప్ లూజర్స్‌లో భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత, అదానీ పోర్ట్స్, గెయిల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.

పదకొండు గంటల సమయానికి టాప్ గెయినర్స్‌లో జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టాప్ లూజర్స్‌లలో వేదాంత, అదాని పోర్ట్స్, హిండాల్కో, భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.
మధ్యాహ్నం గం.11.15కు సెన్సెక్స్ 73.93 (0.19%) పాయింట్లు పెరిగి (నిన్నటితో) 38,580.02, నిఫ్టీ 23.65 (0.21%) పాయింట్లు ఎగిసి 11,451.95 వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో 71.54 వద్ద ట్రేడ్ అయింది.
సిమెంట్ షేర్లు దూసుకెళ్లాయి. ఓరియెంట్ సిమెంట్ షేర్లు మధ్యాహ్నానికి 3 శాతం పెరిగాయి. కాకతీయ సిమెంట్స్, గుజరాత్ సిధీ సిమెంట్స్, హీడెల్బర్గ్ సిమెంట్ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్ షేర్లు అన్నీ కూడా 2 నుంచి 3 శాతం మధ్య పెరిగాయి. ఒకటి రెండు సిమెంట్ షేర్లు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకు షేర్లు కూడా లాభాలను చవి చూశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు షేర్లు 1 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా షేర్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే 1 శాతం లోపల లాభాల్లో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications