న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఉద్యోగులకు దీపావళి పండుగకు ముందు భారీ బొనాంజా ఇచ్చింది! ఈ మేరకు గ్రూప్ B, గ్రూప్ C ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు 60 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో ఇందుకు సంబంధించి డబ్బులు వేశాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సర్క్యులర్ జారీ చేసింది.
ఈ సర్క్యులర్ ప్రకారం ఈపీఎఫ్‌ఓకు గ్రూప్ B, గ్రూప్ C ఉద్యోగులకు అరవై రోజుల బోనస్ లభిస్తుందని పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీంలో భాగంగా ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఉద్యోగులకు మొత్తం 60 రోజుల బోనస్ అందిస్తోంది. దీంతో ఉద్యోగులకు ముందే దీపావళి వచ్చినట్లయింది.

మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సర్క్యులర్ ఆర్డర్ ప్రకారం.. గ్రూప్ B, గ్రూప్ Cఉద్యోగులకు 30.4 రోజుల చొప్పున బోనస్ లభిస్తుంది. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు దాదాపు రూ.14,000 వరకు పొందుతారు. వేర్వేరు ఉద్యోగులకు కేటగిరీ ప్రాతిపదిగన బోనస్ లభిస్తుంది.
ఈపీఎఫ్ఓ బోనస్ లెక్కింపు రోజుల సంఖ్య మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే ఉంటుంది. అయితే ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ మొత్తంలో కేవలం 25 శాతం మాత్రమే ఈఫీఎఫ్ఓ ఎంప్లాయీస్ శాలరీ అకౌంటుకు క్రెడిట్ కానుంది. మిగిలిన 75 శాతం మొత్తం ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications