For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవీకే గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు?: దర్యాప్తు ప్రారంభించిన ఎంసిఏ

|

భారీ మౌలిక రంగ ప్రాజెక్టులు, విద్యుత్, ఎయిర్ పోర్టుల నిర్వహణలో నిమగ్నమై ఉన్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్ నకు చెందిన పలు సంస్థల్లో ఇవి జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్నీ ఒక విజిల్ బ్లోయెర్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఏ) కు ఫిర్యాదు చేసారని వినికిడి. దీంతో అప్రమత్తమైన ఎంసిఏ... ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని మనీ కంట్రోల్ ఒక కథనంలో వెల్లడించింది.

ఫిర్యాదు చేసిన వ్యక్తి ఈ గ్రూప్ కంపెనీల్లో నిధుల దారి మల్లింపు జరుగుతోందని, సంబంధీకులకు ఎక్కువ కాంట్రాక్టులు ఇస్తున్నారని, వ్యయం పెంచి చూపేందుకు నకిలీ ఇన్వాయిస్ లు సృష్టిస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. బోగస్ బిల్లుల ద్వారా ఎక్సయిజ్, కస్టమ్స్ సుంకాల ప్రయోజనం పొందుతున్నట్లు ఆరోపణ. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి అధికారి వద్దకు విజిల్ బ్లోయెర్ కంప్లైంట్ వెళ్లిందని, అందుకే వెంటనే గ్రూప్ కంపెనీ ఖాతాల తనిఖీ చేపట్టినట్లు మనీ కంట్రోల్ పేర్కొంది.

ఉద్యోగులకు TCS సూపర్ ట్రెండ్: పరీక్షలో సత్తాచాటితే శాలరీ ప్యాకేజీ హైక్ఉద్యోగులకు TCS సూపర్ ట్రెండ్: పరీక్షలో సత్తాచాటితే శాలరీ ప్యాకేజీ హైక్

11 సంస్థలపై నిఘా...

11 సంస్థలపై నిఘా...

జీవీకే గ్రూప్ కు చెందిన సుమారు 11 కంపెనీలపై ఈ మేరకు ఆరోపణలు వచ్చాయి. ఇందులో జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జీవీకే జైపూర్ ఎక్ష్ప్రెస్స్ వే వంటి ప్రధాన కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నవీ ముంబై లో కొత్త ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు ను దక్కించుకొని, ప్రస్తుతం దాని నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.

ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీ ల పాత్ర ...

ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీ ల పాత్ర ...

ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవీకే గ్రూప్ కంపెనీలు తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ ఓ సి ) పరిధిలో ఉన్నాయి. కాబట్టి అన్ని కంపెనీలకు తనిఖీ లేఖలు విడిగా పంపించినట్లు తెలిసింది. అలాగే, అవకతవకలపై కంపెనీ ఆడిటర్లు, కొంత మంది కంపెనీ అధికారులు సహా కంపెనీ సెక్రటరీ పాత్రపై ఎం సి ఏ దృష్టి సారించిందని సమాచారం.

కంపెనీ వివరణ...

కంపెనీ వివరణ...

కాగా ఈ విషయంపై స్పందించిన జీవీకే గ్రూప్ వివరణ ఇచ్చింది. గ్రూప్ లోని ఒక్క ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీకి మాత్రమే ఎం సి ఏ నుంచి ఒక సమాచారం అందినదని వెల్లడించింది. వెస్ట్రన్ రీజియన్ లోని రీజినల్ డైరెక్టర్ నుంచి ఆ సమాచారం వచ్చిందని, అందలలో కొంత సమాచారం అడిగినట్లు తెలిపారు. దానికి తగు సమయంలో తాము స్పందన పంపిస్తామన్నారు. అయితే, విజిల్ బ్లోయెర్ కంప్లైంట్ గురించి, ఆధారాలు లేని ఇతర ఆరోపణల గురించి తమకు తెలియదని, అందుకే, వాటిపై స్పందించలేమని స్పష్టం చేసినట్లు మనీ కంట్రోల్ తన కథనంలో వెల్లడించింది.

English summary

జీవీకే గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు?: దర్యాప్తు ప్రారంభించిన ఎంసిఏ | 11 GVK Group entities under MCA scanner post whistle blower plaint

Hyderabad-based GVK Group is under the Ministry of Corporate Affairs’ (MCA) scanner after a whistle-blower alleged siphoning of funds, contracts given to related parties, issue of fake bills to inflate cost, and undue custom and excise duty benefits derived by raising bogus bills, sources told Moneycontrol.
Story first published: Wednesday, October 16, 2019, 7:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X