ప్రయివేటు బ్యాంకు దిగ్గజం హెచ్డీఎఫ్సీ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తగ్గిన వడ్డీ రేట్లు నేటి నుంచి (అక్టోబర్ 15వ తేదీ) నుంచి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హోమ్ లోన్స్ మరింత చౌక కానున్నాయి. హోమ్ లోన్స్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR) 0.1 శాతం తగ్గించింది. దీంతో రుణ రేట్లు 8.25 శాతం నుంచి 8.65 శాతం మధ్యకు చేరుకున్నాయి.
HDFC రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో పాత, కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు తమ రుమాలపై వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నాయి. ఇందులో భాగంగా HDFC నిర్ణయం తీసుకుంది.

రుణాలను రెపో రేటుకు లింక్ చేసిన వివిధ బ్యాంకులు వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు HDFC తగ్గించింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంసీఎల్ఆర్ ను ఇటీవల తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రుణాలు 8.05 శాతానికి తగ్గాయి. జూలై నెల నుంచి వరుసగా రెపో రేట్లు తగ్గుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications