For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్స్‌కు పారిశ్రామిక వేత్తల అండ... భారీగా పెట్టుబడులు

|

ఆధునిక, వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్స్ కు ఆర్థికంగా అండదండగా ఉంటున్నారు పారిశ్రామిక దిగ్గజాలు. వీరి దన్నుతో స్టార్టప్స్ మరింత విశ్వాసంతో ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది పారిశ్రామిక వేత్తలు స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఇంకా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. అయితే ఎంత పెట్టుబడి పెడుతున్నారన్న విషయంలో మాత్రం గోప్యత వహిస్తున్నారు. ఇప్పటికే వీరికి విభిన్న రంగాల్లో వీరు పనిచేసిన అపార అనుభవానికి తోడు ఏయే రంగాల్లోని స్టార్టప్స్ వృద్ధి చెందడానికి అవకాశముందో వీరు అంచనా వేయగలుగుతున్నారు. అందుకే పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. వీరిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఫిలాంత్రఫిస్ట్, టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రస్తుత గౌరవ చైర్మన్, సీరియల్ ఎంట్రప్రెన్యూర్ రతన్ టాటా ముందుంటున్నారు. విభిన్న రంగాల్లోని స్టార్టప్స్ లో టాటా పెట్టుబడులు పెట్టారు. అయన వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టిన కొన్ని స్టార్టప్స్...

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

- స్నాప్ డీల్
-పేటీమ్
-బ్లూ స్టోన్
-అర్బన్ లాడెర్
-కార్ దేఖో
- జీవామే
- కార్యా
-ఫస్ట్ క్రై
-మోగ్లీక్స్
- క్యాజునుగా
- క్యాష్ కరో
-అబ్రా
-ఓలా
- అర్బన్ క్లాప్
-హోలాచెఫ్
-షామీ సబ్ సే బోలో
-యువర్ స్టోరీ
- క్యూర్ ఫిట్
-క్లైమాసెల్
- లెన్స్ కార్ట్
-నెస్ట్ అవే
-డాగ్ స్పాట్
- టార్క్ మోటార్స్

Billionaires is a serial investor in startups

మరింత మంది ఇన్వెస్టర్లు

- విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమజీ
- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి
- టీవీ మోహన్ దాస్ పాయ్ (ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, మణిపాల్ యూనివర్సిటీ చైర్మన్)
- రోహిత్ కే బన్సల్ (స్నాప్ డీల్ సహా వ్యవస్థాపకుడు)
- కునాల్ బహల్ (స్నాప్ డీల్ సహా వ్యవస్థాపకుడు)
- రాజన్ ఆనందన్ (గూగుల్ గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ)

సంపద వృద్ధి, సపోర్ట్

ఇప్పుడు పారిశ్రామిక వేత్తల్లో చాలా మంది వెంచర్ క్యాపిటలిస్టులుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు వ్యాపారాలను ఏర్పాటు చేసి వాటిని నిర్వహించడంకన్నా ఔత్సాహిక ఇన్వెస్టర్లు ప్రారంభించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల వారి సంపద పెరిగే అవకాశం ఏర్పడుతోంది. అంతే కాకుండా నిధుల అవసరం ఉన్న కంపెనీలకు మద్దతుగా నిలుస్తున్నారు.

English summary

స్టార్టప్స్‌కు పారిశ్రామిక వేత్తల అండ... భారీగా పెట్టుబడులు | Billionaires is a serial investor in startups

After heading the $100 billion Tata Group — India’s largest conglomerate — for 24 years, Ratan Tata has turned a serial investor.
Story first published: Tuesday, October 15, 2019, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X