రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు వరుసగా రుణాలపై వడ్డీ రేటును సవరిస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఆంధ్రా బ్యాంకు కూడా వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అన్ని కాలపరిమితులకు వర్తించే విధంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (MCLR)ను 0.1 శాతం లేదా పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది.
రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) తగ్గింపు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు అవుతందని బ్యాంకు తెలిపింది. సాధారణంగా వినియోగ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును నిర్ణయించే ఏడాది కాలపరిమితి MCLR రేటు 8.40 శాతం నుంచి 8.30 శాతానికి తగ్గుతుంది. RLLR 8.35 శాతం నుంచి 8.10 శాతానికి పరిమితం అవుతుంది. ఓవర్ నైట్ నుంచి ఆరు నెలల వరకు 7.80 శాతం నుంచి 8.20 శాతం వరకు ఉంటుంది.

కెనరా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించింది. తగ్గించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రయివేటు బ్యాంకు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కూడా రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తగ్గిన వడ్డీ రేట్లు నేటి నుంచి (అక్టోబర్ 15వ తేదీ) నుంచి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హోమ్ లోన్స్ మరింత చౌక కానున్నాయి. హోమ్ లోన్స్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR) 0.1 శాతం తగ్గించింది. దీంతో రుణ రేట్లు 8.25 శాతం నుంచి 8.65 శాతం మధ్యకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications