ముంబై: మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 14) స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 128.54 పాయింట్లు లాభపడి 38255.62 వద్ద, నిఫ్టీ 41.40 పాయింట్లు ఎగిసి 11346.40 వద్ద ఉంది. 407 షేర్లు లాభాల్లో ఉండగా, 288 షేర్లు నష్టాల్లో, 36 షేర్లు యథావిధిగా ఉన్నాయి. అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్లు 2 శాతం నష్టపోయాయి.
గం.10.22 నిమిషాలకు సెన్సెక్స్ 107.71 పాయింట్లకు తగ్గి 38234.79 వద్ద, నిఫ్టీ 37.20 పాయింట్లకు తగ్గి 11342.20గా ఉంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హిందుస్తాన్ యూనీవర్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంకు, మారుతీ, రిలయన్స్, ఏసియన్ పేయింట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

గం.10.49 నిమిషాలకు సెన్సెక్స్ 229 పాయింట్లు ఎగిసి (అంతకుముందు రోజుతో) 38,356 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి (అంతకుముందు రోజుతో) 11,374 వద్ద ట్రేడ్ అింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
IRCTC బంపర్ డిబట్
IRCTC సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. షేర్ ధరను రూ.315 నుంచి రూ.320 ప్రీమియంతో మదుపర్లకు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ మధ్య అలాట్ చేశారు. గత రెండేళ్లలో దలాల్ స్ట్రీట్లో బెస్ట్ లిస్టింగ్ IRCTCగా చెబుతున్నారు. లిస్టింగ్ రోజునే IRCTC షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కో షేర్ 118 శాతం పెరిగి రూ.698 వరకు చేరుకుంది. ఇష్యూ ధర రూ.315 నుంచి రూ.320 మాత్రమే.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications