IRCTC పరిస్థితేమిటి?: డబుల్‌తో ప్రారంభమైన స్టాక్స్ ఎలా ఉన్నాయంటే?
ముంబై: IRCTC ఐపీవో లిస్టింగ్ నేటి నుంచి (అక్టోబర్ 14) ప్రారంభమైంది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ అదరగొట్టింది. రికార్డ్ స్థాయిలో రెండింతలకు పైగా పెరిగింది. ట్రేడింగ్ మొదలు కాగానే 101 శాతం పెరిగి రూ.644 ధరతో లిస్ట్ కావడం గమనార్హం. ఆ తర్వాత 118 శాతం పెరిగిన షేర్ రూ.698 వరకు కూడా చేరుకుంది. IRCTC ఐపీవో షేర్ ధర రూ.315-320గా నిర్ణయించారు. రూ.320 ధరతో షేర్ సోమవారం లిస్ట్ అయింది. షేర్ ధర ఒక్కసారిగా పెరగడంతో IRCTC మార్కెట్ విలువ రూ.10,9732 కోట్లకు ఎగబాకింది.

గత రెండేళ్లలో IRCTCనే...
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వం IRCTC ఐపీవో తీసుకు వచ్చింది. దీని ద్వారా రూ.645 కోట్లు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవోకు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో కంపెనీ IRCTC. ఇదివరకు IRCTC, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్‌సీవోఎన్‌లు పబ్లిక్ ఆఫర్లకు వచ్చాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ మధ్య ఐఆర్‌సీటీసీకి 112 రెట్ల స్పందన వచ్చింది. గత రెండేళ్లలో లిస్ట్ అయిన ఐపీవోలలో IRCTC రాకెట్ వేగంతో దూసుకు వచ్చింది. అంతకుముందు కూడా పలు కంపెనీలు లిస్టింగ్ సమయంలో రెండింతల వేగంతో వచ్చాయి. ఇందులో బిర్లా పసిఫిక్, సలాసర్ టెక్నో, ఆస్ట్రోన్ పేపర్, అవెన్యూ సూపర్ మార్ట్, కెరీర్ పాయింట్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, బెడ్ ముతా ఇంద్, సీడీఎస్ఎల్ ఉన్నాయి.

లిస్టింగ్ రోజునే డబుల్‌కు పైగా పెరిగిన షేర్లు
- 07-07-2011న బిర్లా పసిఫిక్ రూ.10కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ సమయంలో రూ.10.10గా, క్లోజింగ్ సమయంలో రూ.25.35గా ఉంది. అంటే ఆ రోజున ఈ షేర్ 153.5 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.0.28గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 97 శాతం తగ్గింది.
- 25-07-2017న సలాసర్ టెక్నో రూ.108కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.259.45 కాగా, క్లోజింగ్ సమయంలో రూ.272.10గా ఉంది. అంటే 151.94 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.102.80గా ఉంది. ఇష్యూ నాటితో 4.81 శాతం తగ్గింది.
- 29-12-2017న ఆస్ట్రోన్ పేపర్ రూ.50కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.120.75 కాగా, క్లోజింగ్ 119.70గా ఉంది. అంటే లిస్టింగ్ రోజున లాభపడింది 139.4 శాతం. ప్రస్తుత ధర రూ.95.45గా ఉంది. ఇష్యూ నాటితో 90.90 శాతం పెరిగింది.
- 21-03-2017న అవెన్యూ సూపర్ మార్ట్ రూ.299కి ఇష్యూ చేయగా లిస్టింగ్ ఓపెనింగ్ రూ.604, క్లోజింగ్ రూ.640.75గా ఉంది. లిస్టింగ్ రోజున ఇది 114.3 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.1,821.60గా ఉంది. ఇష్యూ నాటితో 509.23 శాతం పెరిగింది.

లిస్టింగ్ రోజునే డబుల్‌కు పైగా పెరిగిన మరిన్ని షేర్లు..
- 21-03-207న కెరీర్ పాయింట్ రూ.310కి ఇష్యూ చేయగా, లిస్టింగ్ ఓపెనింగ్ 461, క్లోజంగ్ రూ.632.35గా ఉంది. లిస్టింగ్ రోజున 103.98 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.87గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 71.94 శాతం తగ్గింది.
- 26-09-2011న పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ రూ.210కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.200, క్లోజింగ్ రూ.411.65గా ఉంది. ఇది 96.02 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.46.05గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 78 శాతం తగ్గింది.
- 14-10-10లో బెడ్ ముథా ఇండ్ రూ.102కు ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓఫెన్ 114.40, క్లోజింగ్ 180.80గా ఉంది. లిస్టింగ్ రోజున 77.25 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.10.25గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 89.95 శాతం తగ్గింది.
- 30-06-2017న సీడీఎస్ఎల్ రూ.149కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.250 కాగా, క్లోజింగ్ 261.60గా ఉంది. ఇది 75.57 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.205గా ఉంది. ఇష్యూ నాటితో 37.58 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications