అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాలు ఇవే, 10వ స్థానంలో భారత్
ఆర్థికపరమైన ఆపద సమయంలో ఆదుకునే వాటిలో బంగారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పసిడి నిల్వలను ఆయా దేశాలు ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున పెంచుకుంటున్నాయి. దాదాపు అన్ని దేశాలు పసిడి నిల్వలు పెంచుకుంటుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడుతోంది. అత్యధిక పసిడి నిల్వలు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
అమెరికా వద్ద 8,134 టన్నుల బంగారం ఉంది. 3,367 టన్నులతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత నాలుగు నుంచి పది స్థానాల వరకు వరుసగా ఇటలీ (2,451.8 టన్నులు), ఐదో ఫ్రాన్స్ (2,436.1 టన్నులు), రష్యా (2,219.2 టన్నులు), చైనా (1,936.5 టన్నులు), స్విట్జర్లాండ్ (1,040 టన్నులు), జపాన్ (765.2 టన్నులు), భారత్ (618.2 టన్నులు) దేశాలు ఉన్నాయి.

ఆ తర్వాత నెదర్లాండ్స్ 612.45 టన్నులు, యూరో ఏరియా 504.80 టన్నులు, సౌదీ అరేబియా 323.07 టన్నులు, టర్కీ 320.69 టన్నులు, యనైటెడ్ కింగ్‌డమ్ 310.29 టన్నులు, స్పెయిన్ 281.58 టన్నులు, సింగపూర్ 127.40 టన్నులు, సౌతాఫ్రికా 125.31 టన్నులు, మెక్సికో 120.03 టన్నులు, సౌత్ కొరియా 104.40 టన్నులు, ఇండోనేషియా 78.54 టన్నులు, ఆస్ట్రేలియా 68.74 టన్నులు, బ్రెజిల్ 67.36 టన్నులు, అర్జెంటీనా 61.74 టన్నులు నిల్వ చేసింది.


Click it and Unblock the Notifications