నగదు బదిలీ... సర్కారుకు ఎంత అదా అయిందో తెలుసా!
గతంలో ప్రభుత్వం నుంచి లబ్దిదారుని చేతికి నగదు అందాలంటే ఎంతో కాలం వేచిచూడాల్సి వచ్చేది. ఆ సొమ్ము కోసం అవసరమైతే అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారుల చేయి తడపనిదే నగదు లబ్ది దారుని చేతికి అందేది కాదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా లబ్ది దారుని బ్యాంకు ఖాతాకే డబ్బు చేరేలా చర్యలు తీసుకుంది. దీని మూలంగా అటు లబ్ది దారులకు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం జరుగుతోంది. అనేక రకాల పథకాలకు ఇప్పుడు నగదు బదిలీ విధానం అమలు అవుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువులకు కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేసింది. దీని మూలంగా మొదటి ఏడాదిలో 154 కోట్ల డాలర్లు (సుమారు రూ.10,800 కోట్లు) ప్రభుత్వం అదా చేయగలిగిందని ఎం ఎస్ సి అధ్యయనం వెల్లడించింది.
నగదు బదిలీ విధానాన్ని అమలు చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలిగాయి. రసాయనిక ఎరువుల కదలిక ట్రాకింగ్, అవసరం ఎంతమేరకు ఉంది, స్టాక్ లభ్యత వంటి వాటిలో పారదర్శకత పెరిగింది. ఫలితంగా తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. సరఫరా పెరిగే అవకాశాలు కూడా ఏర్పడినాయి.

ఆధార్ ఆధారంగా ..
* ఎరువులకు సంభందించి నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం 2017 అక్టోబర్ లో ప్రారంభించింది. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేశారు. ఆధార్ ఇందులో కీలక పాత్ర పోషించింది. ఆధార్ ఆధారంగా రైతులకు రిటైలర్లు ఎరువులను విక్రయిస్తున్నారు. ఈ డేటా ను బట్టి ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు సబ్సిడీని బదిలీ చేసింది.
* ఈ విధానం అమలు కారణంగా ఎంతమేరకు ప్రయోజనం కలిగిందన్న దానిపై అధ్యయనము నిర్వహించారు. తొలి ఏడాదిలో ఫెర్టిలైజర్లకు నగదు బదిలీ చేయడం వల్ల ప్రభుత్వానికి 154 కోట్ల డాలర్లు ఆదా అయినట్టు అధ్యయనంలో వెల్లడయింది.
* ఆధార్ లేకుండా, ఇతర లావాదేవీలు బాగా తగ్గినట్టు గుర్తించారు. రైతులను గుర్తించకుండా జరిపే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
* పాయింట్ అఫ్ సేల్ డివైజ్ ల ద్వారా లావాదేవీలు మరింత వేగంగా జరుగుతున్నాయి. వీటి వినియోగం క్రమంగా పెరుగుతోంది.
* ఫర్టిలైజర్ నగదు బదిలీ కోసం రిటైలర్లు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐ డీ తో పటు కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐ డీ కార్డు కూడా వినియోగిస్తున్నారు.
* ప్రభుత్వం ఫర్టిలైజర్ సబ్సిడీ నిమిత్తం వార్షికంగా రూ.70,000 కోట్లు ఇస్తోంది.


Click it and Unblock the Notifications