నిరాశపరిచిన TCS: ఐనా బంపరాఫర్, ఒక్కో షేర్‌పై 4000% డివిడెండ్

భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (జూలై - సెప్టెంబర్)లో 8.4 శాతం రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. గురువారం టీసీఎస్ రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 1.8 శాతం మాత్రమే పెరిగి రూ.8,042 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.7,091 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.36,854 కోట్ల నుంచి 5.8 శాతం మేర పెరిగి రూ.38,977 కోట్లకు చేరుకుంది. క్వార్టర్ పరంగా 1 శాతం లాభం తగ్గింది. ఆదాయంలో 2.1 శాతం వృద్ధి నమోదయింది.

రూ.45 డివిడెండ్

రూ.45 డివిడెండ్

టీసీఎస్ ఒక్కో షేర్ పైన రూ.45 వరకు డివిడెండ్ ప్రకటించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ పైన రూ.5 (500 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే ప్రత్యేక డివిడెండ్ కింద రూ.40 (4000 శాతం) ఇవ్వనుంది. అంటే మొత్తం రూ.45 ఇస్తుంది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 18 రికార్డు తేదీ, అక్టోబర్ 24 చెల్లింపు తేదీలుగా ఉంటాయి.

నిరాశపరిచిన టీసీఎస్

నిరాశపరిచిన టీసీఎస్

సాధారణంగా జూలై - సెప్టెంబర్.. అంటే క్వార్టర్ 2ను టెక్ కంపెనీలకు మంచి బిజినెస్/లాభాలు తీసుకు వచ్చే కాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ వృద్ధి 9 నుంచి 9.5 శాతం వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అంచనాలకు తగిన ఆదాయం లేదు. ఆపరేటింగ్ మార్జిన్ 24 శాతంగా నమోదయింది. ఇది కూడా ఆశించిన మేర లేదు.

టీసీఎస్ క్యూ2 హైలైట్స్

టీసీఎస్ క్యూ2 హైలైట్స్

- రెవెన్యూ - రూ.38,977 కోట్లు, +5.8%

- కాన్సంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్: +8.4%

- నెట్ ప్రాఫిట్ - రూ.8,042 కోట్లు, +1.8%

- నిర్వహణ మార్జిన్ - 24%

- ఒక్కో షేర్ పైన ఎర్నింగ్స్ - రూ.1.43, +3.8%

- డిజిటల్ రెవెన్యూ - 33.2%, వృద్ధి 27.9%

- క్వార్టర్ 2లో అదనంగా చేరిన ఉద్యోగుల సంఖ్య- 14,097

- ఐటీ సర్వీస్ అట్రిషన్ రేట్ -11.6% LTM

- లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ (+16%), కమ్యూనికేషన్స్ అండ్ మీడియా (+11.8%)లో రెవెన్యూ గ్రోత్ అధికంగా ఉంది.

- BFSI రెవెన్యూ గ్రోత్ 8 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్ రెవెన్యూ 7.8 శాతం, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ రెవెన్యూ 5.6 శాతం, రిటైల్ అండ్ సీపీజీ రెవెన్యూ 4.8 శాతంగా ఉంది.

- డిజిటల్ విభాగ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే మాత్రం 27.9 శాతం పెరిగింది. సంస్థ మొత్తం ఆదాయంలో దీని ఆదాయమే 33.2 శాతం.

ఆదాయం ఈ దేశాల నుంచి అధికం..

ఆదాయం ఈ దేశాల నుంచి అధికం..

టీసీఎస్ ఆదాయ వృద్ధిలో బ్రిటన్, ఐరాపా బిజినెస్ పాత్ర ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో రెవెన్యూ 13.3 శాతం పెరగగా, ఐరోపాలో 16 శాతం వృద్ధి ఉంది. ఉత్తర అమెరికా, ఆసియా పసిఫిక్ విపణుల్లో వ్యాపార ఆదాయాలు వరుసగా 5.3 శాతం, 6.5 శాతం మేర పెరిగాయి.

ఈ త్రైమాసికంలో ఉద్యోగులు 14,097మందిని టీసీఎస్ నియమించుకుంది. సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్‌లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,50,738కి చేరుకుంది.

పరిస్థితులు భిన్నంగా....

పరిస్థితులు భిన్నంగా....

అయితే, 2019-20 ఆదాయంలో రెండంకెల వృద్ధిని సాధించడం కష్టమనే అభిప్రాయాన్ని టీసీఎస్ వ్యక్తం చేసింది. ఏడాది ప్రారంభంల అంచనా వేసిన దాని కంటే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలిపింది. మొదటి అర్థ భాగంతో పోలిస్తే రెండో అర్ధభాగంలో మెరుగ్గా ఉండాల్సిందని, రెండంకెల వృద్ధి లక్ష్యానికి సవాళ్లు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ పన్ను తగ్గింపు ఇచ్చినప్పటికీ తమకు దాంతో పెద్దగా ప్రయోజనం లేదని తెలిపింది. ఇప్పటికే పలు పన్ను ప్రోత్సాహకాలు పొందుతున్నట్లు తెలిపారు.

టీసీఎస్ షేరు నష్టం...

టీసీఎస్ షేరు నష్టం...

సమీక్షా కాలంలో షేర్ వారీ ఆర్జన రూ.20.66 నుంచి రూ. 21.43కు పెరిగింది. నిర్వహణ ఆదాయం 4.20 శాతం తగ్గి రూ.9,361 కోట్లకు చేరుకుంది. కంపెనీలో ఉద్యోగుల వలసల రేటు 11.60 శాతంగా ఉంది. ఉద్యోగుల శిక్షణ కోసం కంపెనీ పెట్టుబడులను కొనసాగిస్తుంది. 3.22 లక్షలకు పైగా ఉద్యోగులకు డిజిటల్ టెక్నాలజీల్లో, 3.91 లక్షలకు పైగా ఉద్యోగులకు ఎగైల్ మెథడ్స్‌లో శిక్షణను ఇచ్చింది. కాగా, గురువారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు 0.80 శాతం నష్టపోయి రూ.2004.40 వద్ద క్లోజ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+