అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్(APPFCL)కు అప్పు పుట్టడం కష్టంగా ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రుణానికి గ్యారెంటీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినప్పటికీ SBI మాత్రం అసలు అప్పులు ఎలా తీర్చగలరని అనుమానాలు వ్యక్తం చేసింది. మీకు అప్పు ఇస్తే తీర్చగలరా, ఎలా తీరుస్తారు, ఇదివరకు తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా ఆదాయం ఉందా అనే పలు ప్రశ్నలు ఏస్బీఐ సంధించినట్లుగా వార్తలు వచ్చాయి. తాము అనుమానాలను నివృత్తి చేస్తే వాటిని తమ కార్పోరేట్ కార్యాలయానికి పంపిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, తాము ఎస్బీఐకి వివరణ ఇచ్చినట్లు ఏపీపీఎఫ్‌సీఎల్ ఎండీ తెలిపారు.

గత ప్రభుత్వ హామీలు ఉపసంహరించుకోలేదు...
ఎస్బీఐ అనుమానాలు ఎక్కువగా క్రిసిల్ ఇచ్చిన డి రేటింగ్ ఆధారంగా ఉందని తెలుస్తోందని పేర్కొన్నారు. విభజనకు ముందు జరిగిన వాటి కారణంగా క్రిసిల్ రేటింగ్ తగ్గిందని చెప్పారు. విభజన జరిగి ఏడేళ్లవుతున్నా విభజన జరగలేదని, దీంతో తెలంగాణ సంస్థల పేమెంట్స్ ఆలస్యమవుతోందని, ఇది కారణమని చెబుతున్నారు. విభజన అనంతరం ఏపీకి చెందిన వివిధ సంస్థలు నిధులు సేకరించాయని, ఎక్కడా డిఫాల్ట్ లేదని అలాగే, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఉపసంహరించుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ తిరిగి చెల్లించే సామర్థ్యంపై ఎస్బీఐ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యక్తం చేసిన అనుమానాలు.....

దీనిని ఎలా అధిగమిస్తారు?
APPFCL ప్రతిపాదిత రుణ ప్రణాళిక ప్రకారం అప్పులు, ఆస్తుల మధ్య అంతరం 714.32 రెట్లుకు చేరుకోవడం, ఆర్జిస్తున్న లాభాలు కేవలం 0.04 శాతం ఉండటం, విద్యుత్ బాండ్స్ ద్వారా సేకరించిన రూ.4వేల కోట్లకు క్రిసిల్ డి గ్రేడ్ ఇవ్వడం వంటి కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ మీద రుణ ప్రతిపాదన ఆధారపడుతోంది. క్రిసిల్ గత నెల 17న జారీ చేసిన ఎక్స్టర్నల్ క్రెడిట్ రేటింగులో పలు బాండ్స్‌కు డి గ్రేట్ కేటాయించింది. తద్వారా సంస్థ రుణాల చెల్లింపు జాప్యానికి ఇది నిదర్శనం అంటున్నారు. దీనిని ఎలా అధిగమిస్తారో చెప్పాల్సి ఉంటుంది.

మరో రేటింగ్ అవసరమా?
APPFCL కొత్తగా ప్రతిపాదించిన రూ.5 వేల కోట్ల బాండ్లకు క్రిసిల్ సంస్థ ప్రొవిజనల్‌గా ఏ ప్లస్ గ్రేడ్ కేటాయించింది. అయితే బాండ్ల జారీకి ప్రొవిజనల్ రేటింగ్ ఉపయోగపడదని ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో గత నెల 17న క్రిసిల్ సంస్థ ఇఛ్చిన గ్రేడింగ్‌ను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే బ్రిక్ వర్క్ సంస్థ అగస్ట్ 13న ఇచ్చిన ఎక్స్టర్నల్ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా APPFCL రుణ ప్రతిపాదనను సిద్ధం చేసింది. అయితే బ్రిక్ వర్క్ ఎన్సీడీ రేటింగ్ ఇచ్చింది. అది రూ.5వేల కోట్లకు మాత్రమే. ప్రతిపాదిత అప్పులు మాత్రం రూ.9వేల కోట్లకు పైన. ఈ నేపథ్యంలో బ్రిక్ వర్క్ పాత రేటింగ్ ఆధారంగా రుణ మంజూరు సాధ్యమా లేక మరో రేటింగ్ అవసరమా ధృవీకరించుకోవాల్సి ఉంది.

అప్పులు, ఆస్తుల మధ్య అంతరం 714 రెట్లకు చేరుకుంటుంది...
సంస్థకు ఉన్న అప్పులతో పోలిస్తే నికర నిధులు రూ.16.92 కోట్లు మాత్రమే. గత ఏడాది అప్పులు, ఆస్తుల మధ్య అంతరం 141.32 రెట్లు కాగా, ఈ సంవత్సరంలో తీసుకునే రుణాలతో కలిపితే ఏకంగా 714.32 రెట్లకు చేరుకుంటుంది. సంస్థ ఆస్తులు, అప్పుల నిష్పత్తి ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి 1:1గా ఉంది. కానీ 1.25:1గా ఉండాలి. క్రిసిల్ సంస్థ ఇచ్చిన డీ గ్రేడ్ ఆధారంగా ఈ సంస్థ తాను తీసుకున్న అప్పులతో ఆదాయం సంపాదించడం ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది.

రూ.12,067 కోట్లకు అప్పులు...
ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ రూ.2,325 కోట్లకు పైగా ఉండగా, ఇవి రూ.12,067.03 కోట్లకు పెరుగుతాయనేది అంచనా మాత్రమేనని పేర్కొంది. అదే స్థాయిలో అప్పులు కూడా ఉన్నాయి. APPFCLకు, ప్రభుత్వానికి, రుణాలు ఇచ్చే బ్యాంకుకు మధ్య రుణం తిరిగి చెల్లింపు కోసం ఒప్పందం ఏమైనా ఉంటుందా.. అనే వివరాలు తెలపాలని కోరింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications