ఓ పురుషుడుకి ఛాతి పెరగడానికి కారణమైన ఓ ఉత్పత్తికి కోర్టు జరిమానా వేసింది. సదరు బాధితుడుకి పెద్ద మొత్తం పరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ ఉత్పత్తి వాడిన ఓ పురుషుడి ఛాతి మహిళలకు వక్షోజాలు పెరిగినట్లుగా పెరిగింది. దీంతో అతను కోర్టుకు వెళ్లాడు. పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 8 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఫిలడెల్ఫియా కోర్టు చెప్పింది.

మహిళల వక్షోజాల వలె పెరిగిన చాతి
పెన్సిల్వేనియాకు చెందిన ఆటిజం స్పెక్ట్రమ్ అనే వ్యాధితో బాధపడుతున్న నికోలస్ ముర్రే 2003లో సైకాలజిస్ట్‌ను కలిశాడు. అతను ఓ మందు రాసిచ్చాడు. అతనికి మహిళల వలె వక్షోజాలు పెరిగాయి. దీంతో నికోలస్ ఆ మందును ఉత్పత్తి చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై కోర్టుకు వెళ్లాడు. ఈ ఔషధం వాడకం వల్ల పురుషుల్లో ఛాతి పెరుగుతుందనే విషయాన్ని సంస్థ పేర్కొనలేదని, దీంతో తనకు ఛాతి పెరిగిందని పేర్కొన్నాడు.

8 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశం..
దీనిని విచారించిన ఫిలడెల్ఫియా కోర్టు బాధితుడుకి 8 బిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును కోర్టు వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నట్లు కంపెనీ తరఫు లాయర్ చెప్పారు.

2015లో తీర్పు వచ్చినా..
అతను జే అండ్ జే డ్రగ్‌ను 2003 నుంచి 2008 వరకు ఉపయోగించాడు. ఆ కాలంలో అతని ఛాతి వక్షోజాల్లా పెరిగింది. ఈ కేసులో 2015లోనే ఓ జడ్జి తీర్పు చెప్పారు. బాధితుడికి 680,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే ప్యునిటివ్ డ్యామేజెస్ ఇంక్లూడ్ కాలేదు. ఇప్పుడు అతనికి 8 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications