ఆఫర్లు అంటేనే ఆన్లైన్ అనే ధోరణి త్వరలోనే మారుతుందేమో. తక్కువ ధరలో ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేయాలంటే ఏ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కోసమో, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ కోసమో ఎదురు చూడాల్సిందే. అందుకే దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ఇటీవల ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ ఆశించిన స్థాయిలో పెరిగాయి. మెరుగైన ఆఫర్లతో, ఫాస్ట్ డెలివరీ తో ఈ కంపెనీలు దూసుకు పోయాయి. అయితే, ఇప్పటివరకు పెద్ద డిస్కౌంట్లు ఇవ్వలేని ఆఫ్-లైన్ స్టోర్లు మాత్రం ఈ సారి ఆన్లైన్ పోర్టల్స్ తో పోటీ పడుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ల నుంచి దుస్తుల వరకు అన్ని క్యాటగిరీల్లోనూ భారీ డిస్కౌంట్ల ను ఆఫర్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకింత వివక్ష చూపిన తయారీ కంపెనీలు కూడా ప్రస్తుతం రిటైల్ స్టోర్ లకు కూడా ఆన్లైన్ తో సమానమైన మార్జిన్స్ అందిస్తున్నాయి. దీంతో అమ్మకాల పెంపు లక్ష్యంగా స్టోర్ ల యజమానులు ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లు ... టీవీలు ...
పండుగ ఏదైనా అమ్మకాలు అధికంగా ఉండేది స్మార్ట్ ఫోన్లు... టీవీలవే. భారత దేశంలో కొత్త వస్తువులు ఏదైనా సరే కొనేందుకు మంచి ముహూర్తం చూస్తారు. అందుకే, ఫోన్ల నుంచి టీవీల వరకు, రెఫ్రిజిరేటర్ల నుంచి వాటర్ ఫిల్టర్ల వరకు పండుగల సందర్భంగా కొనుగోలు చేస్తున్నారు. కాగా, మొత్తం పండుగ అమ్మకాల్లో సింహ భాగం ఆక్రమించేది స్మార్ట్ ఫోన్లే అంటే అతిశయోక్తి కాదు. కానీ కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ కొనాలంటే కేవలం ఈకామర్స్ వెబ్సైట్ల వైపు చూడాల్సిందే. ఎందుకంటే, స్టోర్ ధరతో పోల్చితే కనీసం రూ 1,000 నుంచి రూ 2,000 వరకు తక్కువ ధరకే ఆన్లైన్ లో లభిస్తాయి. ఇంటికే డెలివరీ అందిస్తాయి. దీంతో వినియోగదారులు ఆన్లైన్ వైఎప్ మొగ్గుచూపారు. కానీ ఈ సారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై 7-10% వరకు డికౌంట్లు లభిస్తున్నాయి.

మారిన వ్యూహాలు ...
వన్ ప్లస్, షియామి, రియల్ మీ, టీసీఎల్ వంటి బ్రాండ్లు, వీయూ వంటి సంస్థలు తొలుత కేవలం ఈకామర్స్ వెబ్సైట్లు... ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు మాత్రమే ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేవి. కానీ ఆన్లైన్- ఆఫ్-లైన్ వ్యాపారుల మధ్య ఒక రకమైన విభేదాలు నెలకొన్నాయి. రిటైల్ స్టోర్ ల యజమానులు సంఘం ప్రభుత్వానికి తమకు జరుగుతున్న వివక్షను వెల్లడించి ఆన్లైన్ ఆఫర్లపై పరిమితి విధించేలా చేయగలిగింది. దీంతో, ఈకామెర్స్ కంపెనీల కంటే ముందుగా ప్రొడక్టుల కంపెనీలే తమ వ్యూహాలను మార్చుకున్నాయి. కేవలం ఒక వర్గానికి (ఆన్లైన్) చేరువ అయ్యి మరో వర్గానికి (స్టోర్లు) దూరం కావటం వల్ల తమ అమ్మకాలు ప్రభావితం అవుతున్నాయని గ్రహించాయి. దీంతో రెండింటికీ సమాన మార్జిన్ల ను అందించాలని నిర్ణయించాయి. దీంతో ప్రస్తుతం వన్ ప్లస్, షియామి, రియల్ మీ, టీసీఎల్, వీయూ వంటి బ్రాండ్లు ఆన్లైన్ ఆఫర్లతో సమానంగా స్టోర్ల లో లభిస్తున్నాయి. సామ్ సుంగ్ మాత్రం ఎప్పటి నుంచో రెండిటికీ సమాన మార్జిన్ల ను అందిస్తోంది. చాలా ఉత్పత్తులపైన కనీసం 30% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

40-50% అమ్మకాలు ...
దేశంలో దసరా తో మొదలయ్యే పండుగల సీజన్... సంక్రాంతి తో ముగుస్తుంది. దసరా, దీపావళి, క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా కనీసం నాలుగు నెలలు అమ్మకాలు మెరుగ్గా ఉంటాయి. ఈ పండుగల సీజన్ లోనే ఏడాది మొత్తం అమ్మకాల్లో 40% నుంచి 50% అమ్మకాలు జరుగుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకే వినియోగదులను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కొత్త దుస్తుల విక్రయాలు భారీగా పెరిగుతున్నాయి. గతేడాదితో పోల్చితే కనీసం 20% అధికంగా సేల్స్ ఉంటున్నాయని ప్రముఖ మాల్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. మిగితా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు కూడా సగటున 30% ఏడాది సేల్స్ ఇప్పుడే నమోదు అవుతాయని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ హల్‌చల్...
అన్ని విషయాల్లోనూ ముందుండే తెలుగు వారు... పండుగల అమ్మలకాలపై ఆఫర్ల విషయంలోనూ దూసుకుపోతున్నారు. లైఫ్ స్టైల్ ఉత్పత్తుల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు భారీ డిస్కౌంట్ల ను అందిస్తున్నారు. బిగ్ సి, లాట్ మొబైల్స్, హ్యాపీ మొబైల్స్, ఆర్ ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, సీఎంఆర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, టీఎంసీ, కళ్యాణ్ జెవెల్లెర్స్, కేఎల్ఎం ఫాషన్ మాల్, మలబార్ గోల్డ్, అనుటెక్స్ వంటి స్టోర్లు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. బిగ్ బజార్, రిలయన్స్ ట్రెండ్స్ లోనూ డికౌంట్లు లభిస్తున్నాయి. చాలా కాలంగా అమ్మకాలు లేక ఉసూరుమంటున్న కార్లు, ద్విచక్ర వాహనాల డీలర్లు కూడా పండుగల ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. లక్కీ డ్రాలతో అదరగొడుతున్నాయి. గెలిచిన వారికి బైక్ లు, కార్లు, బంగారం, బంగళ, నగదు గెలుచుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

బ్యాంకులు, కార్డుల ఊతం...
ఆన్లైన్ కు ధీటుగా... స్టోర్లలో కొనుగోలు చేసే ప్రొడక్టులపై కూడా జీరో డౌన్ పేమెంట్ లు, ఈఎంఐ ఆప్షన్లు లభిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ విషయంలో చాలా ముందు ఉండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ సంస్థలు ఇన్స్టంట్ కాష్ బ్యాక్ లేదా... ఈజీ ఈఎంఐ ఆప్షన్ల ను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు కొనుగోళ్లు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎంత పెద్ద వస్తువైనా రూ 1 తో కొనుగోలు చేసే ఆప్షన్లు ఉండటంతో అందరికి కలిసివస్తోంది. సో, మారేందుకు ఆలస్యం. మీరు కూడా తక్కువ ధరలో కావాల్సిన వస్తువును కొనుగోలు చేయొచ్చు. ఓ లుక్కేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications