For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్టీఐ షాక్: కేవలం 88 మంది డిఫాల్టర్లు.. రూ.1.07 లక్షల కోట్లు

|

దేశంలో 88 మంది అతిపెద్ద ఎగవేతదారులు (డిఫాల్టర్లు) వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.1.07 లక్షల కోట్లు కోల్పోయాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్బీఐ నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆర్టీఐ కింద.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి రూ.500 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నవారి జాబితాను వెల్లడించింది. ఇందులోని వారి రుణాలను బ్యాడ్ డెబిట్స్‌గా పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి. సమాచారం మేరకు....

12 ఏళ్లలో 191 మిలియన్లు సంపాదించిన కాగ్నిజెంట్ మాజీ సీఈవో12 ఏళ్లలో 191 మిలియన్లు సంపాదించిన కాగ్నిజెంట్ మాజీ సీఈవో

రూ.1,07,423 కోట్లు

రూ.1,07,423 కోట్లు

రూ.500 కోట్లకు (ఒక్కొక్కరు) పైగా తీసుకున్న రుణగ్రహీతలు 88 మంది ఉన్నారు. వీరు తీసుకున్న మొత్తం రూ.1,07,423గా ఉంది. అంటే ఒక్కొక్కరు సరాసరిగా రూ.1,220 కోట్లు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వారు, మాఫీ చేసిన రుణాల వివరాలు కావాలని ఆర్టీఐ దరఖాస్తుదారు కోరారు. మార్చి 31, 2018 నాటికి రిటన్ ఆఫ్ చేసిన రుణాల విలువ రూ.1,07,423 కోట్లుగా తెలిపింది. మొత్తం రుణగ్రహీతలు 88 మంది.

రుణాలు ఎగ్గొట్టే వారి పేర్లు చెప్పాలి..

రుణాలు ఎగ్గొట్టే వారి పేర్లు చెప్పాలి..

ప్రయివేటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం రాలేదు. కానీ ఆర్బీఐ-డీబీఎస్‌కు బ్యాంకులు నివేదించిన ప్రకారం 88 మంది రుణగ్రహీతలు తీసుకున్న రూ.1 లక్ష కోట్ల రుణాలను రిటన్ ఆఫ్ (రద్దు) చేసారు. రుణాలు తీసుకొని ఎగ్గొట్టేవారి పేర్లు తెలియజేయాలని, తద్వారా ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఆర్బీఐ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు, సర్క్యులర్స్ జారీ చేస్తోంది.

డిఫాల్టర్లను గుర్తించేందుకు ఆర్బీఐ సూచన

డిఫాల్టర్లను గుర్తించేందుకు ఆర్బీఐ సూచన

కేంద్ర బ్యాంకు ఇప్పటికే ఓ కొత్త ఫ్రేమ్ వర్క్‌ను బ్యాంకులకు సూచించింది. తద్వారా బ్యాంకులు రుణాలు తీసుకొని చెల్లించని వారిని తక్షణమే గుర్తించడానికి ఈజీ అవుతుంది. రూ.500 కోట్లకు పైగా బాకీపడిన వారి జాబితాను ఆర్బీఐ 2016లో సుప్రీం కోర్టుకు సమర్పించింది.

English summary

ఆర్టీఐ షాక్: కేవలం 88 మంది డిఫాల్టర్లు.. రూ.1.07 లక్షల కోట్లు | 88 defaulters cost PSUs Rs.1.07 lakh crore

Thanks to 88 biggest defaulters in the country, public sector banks in India have virtually lost Rs 1.07 lakh crore in bad debts.
Story first published: Thursday, October 10, 2019, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X