For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిలో రికార్డ్స్ బద్దలుకొట్టిన ఇమ్రాన్ ఖాన్, పాక్ నెత్తిన అప్పుల కుప్ప

|

కరాచీ: ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో పాక్ డెబిట్స్ ఏకంగా రూ.7,509 బిలియన్ (పాకిస్తాన్ కరెన్సీ) మేర పెరిగాయి. దీంతో పాకిస్తాన్ ప్రస్తుత డెబిట్స్ రూ.32,240 కోట్లకు చేరుకుంది. డెబిట్స్ పెరుగుదల కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తన తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వాల రుణాల రికార్డ్స్ అన్నింటిని బద్దలు కొట్టింది.

అధికారిక డేటా ప్రకారం ఏడాది కాలంలో ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ రుణాలను రూ.7,509 బిలియన్లు (పాకిస్తాన్ కరెన్సీ)కు పెంచింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇందుకు సంబంధించిన డేటాను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించింది. ఆగస్ట్ 2018 నుంచి ఆఘస్ట్ 2019 మధ్య ప్రభుత్వం ఫారన్ సోర్స్ నుంచి రూ.2,804 బిలియన్ మొత్తాన్ని రుణంగా తీసుకుంది. అలాగే, డొమెస్టిక్ సోర్స్ నుంచి రూ.4,705 బిలియన్లు తీసుకుంది.

డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!

Mounting debt: Imran Khans govt breaks all records in borrowing money

ఇంతకుముందు ఏ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏడాదిలోపు ఇంత రుణం తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం భారీ మొత్తం రుణాలు తీసుకోవడంతో రుణభారం రూ.32,240 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇమ్రాన్ అధికారంలోకి రాకముందు ఈ అప్పులు రూ.24,73,200 కోట్లుగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో ప్రభుత్వ రుణాలలో పెరుగుదల శాతం 1.43 శాతంగా ఉంది. ప్రస్తుత తొలి ఆర్థిక త్రైమాసికానికి పాకిస్తాన్ రూ.1 లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.96,000 కోట్లు వసూలు చేసింది.

English summary

ఏడాదిలో రికార్డ్స్ బద్దలుకొట్టిన ఇమ్రాన్ ఖాన్, పాక్ నెత్తిన అప్పుల కుప్ప | Mounting debt: Imran Khan's govt breaks all records in borrowing money

Pakistan's ruling Imran Khan government has broken all previous records in borrowing money merely in the first year of its tenure. According to the official data, during the one-year regime of the present government an increase of Rs 7,509 billion (Pakistani currency) was recorded in the total debt of the country.
Story first published: Wednesday, October 9, 2019, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X