For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు డీఏ ఎఫెక్ట్: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

|

ముంబై: బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి భారీగా పుంజుకున్నాయి. గత ఆరు సెషన్లలో నష్టాలను చవి చూసిన మార్కెట్లు, కేంద్ర ప్రభుత్వ వరుస ఉద్దీపన చర్యలతో లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 646 పాయింట్లు లాభపడి 38,178 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 11,313 లాభంతో క్లోజ్ అయింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.96గా ఉంది.

సూచీలు మధ్యలో కొంత నెమ్మదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కలిసి వచ్చింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. వీటికి తోడు ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు తక్కువగా ఉండటం కూడా మార్కెట్ లాభాలకు కారణం.

Market Update: Sensex jumps 400 pts, Nifty above 11,200

అంతకుముందు ఉదయం, మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.29 నిమిషాలకు సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 37,663.12 వద్ద ట్రేడ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీవర్, ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో ట్రేడ్ కాగా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం గం.1.33 నిమిషాలకు సెన్సెక్స్ 415.18 (1.10%) పాయింట్లు లాభపడి 37,944.95 వద్ద, నిఫ్టీ 123.70 (1.11%) పాయింట్ల లాభంతో 11,250.10 వద్ద ట్రేడ్ అయింది.

ఉదయం పది గంటల సమయంలో కొటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎప్‌సీ, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐఎన్, ఐటీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, ఓఎన్జీసీ, యస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!

డాలరుతో రూపాయి మారకం విలువ 70.77గా నమోదయింది. ఈ వారం జూలై - సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. యస్ బ్యాంకు షేర్లు పది శాతానికి పైగా నష్టపోయాయి. టైటాన్ షేర్లు ఆరు శాతం తగ్గాయి. రెమాండ్ షేర్లు 9 శాతం పెరిగాయి.

English summary

ఉద్యోగులకు డీఏ ఎఫెక్ట్: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Market Update: Sensex jumps 400 pts, Nifty above 11,200

Among the sectors, Bank Nifty along with the PSU banking index jumped over 2 percent led by IndusInd Bank, ICICI Bank, HDFC Bank, SBI, Kotak Mahindra Bank and PNB.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X