దసరా, దీపావళి పండుగ సీజన్ వ్యాపారులకు మంచి సీజన్. ఈ పండుగ సీజన్లోనే ఎక్కువగా సేల్స్ ఉంటాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా ఈ పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇటీవల దసరా సందర్భంగా సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇప్పుడు మరోసారి ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ రెండు దిగ్గజాలు కూడా దీపావళి పండుగ సందర్భంగా ఒక్కరోజు తేడాతో ఆఫర్లు ప్రకటించాయి.
దసరా, దీపావళి పండుగ సీజన్ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉంది. ప్రైమ్ కస్టమర్లకు అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచే ఆఫర్లు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్ 12వ తేదీన ప్రారంభమవుతోంది. అమెజాన్ సేల్స్ 13న ప్రారంభమవుతోంది.

వీటితో ప్రత్యేక డిస్కౌంట్స్
ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అమెజాన్ పే ద్వారా అదనపు క్యాష్ బ్యాక్ సౌకర్యాలు ఉన్నాయి. డెబిట్ కార్డు ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. స్పెషల్ క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష వరకు ఉంది.

డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్..
దీపావళి సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పైన 40 శాతం డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే అదనంగా ఎక్స్చేంజ్, ఫ్రీ రీప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. OnePlus 7, Redmi 7A, Redmi Y3, Redmi 7, Samsung Galaxy M30, Nokia 6.1 Plus, Honor 8X, Realme U1 వంటి స్మార్ట్ ఫోన్స్ పైన మంచి ఆఫర్లు ఉన్నాయి.

50 శాతం నుంచి 75 శాతం
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో వివిధ ఉత్పత్తులపై 50 శాతం నుంచి 75 శాతం, అంతకుమించి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ పైన మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్, కెమెరాలు, స్మార్ట్ వాచీలపై కూడా డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లపై...
Redmi Y3 స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999 కాగా ఇది రూ.7,999, Redmi 7A ధర రూ.5,999 కాగా ఆఫర్ కింద రూ.4,999, Redmi 7 ధర రూ.7,499 కాగా ఆఫర్ కింద రూ.6,999, Samsung Galaxy M30 ధర రూ.11,000 కాగా ఆఫర్ కింద రూ.9,999, Samsung Galaxy M30s ధర రూ.13,999 కాగా అమెజాన్ పే బ్యాలెనస్‌లోకి రూ.1000 క్యాష్ బ్యాక్ వస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications