స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 155 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.25 సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు (0.23 శాతం)తో 37,588 వద్ద, నిఫ్టీ 46తో (0.41 శాతం) 11,129 వద్ద ట్రేడ్ అయ్యాయి. గం.9.46 సమయానికి సెన్సెక్స్ 37,839 వద్ద, నిఫ్టీ 11,209 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.80 వద్ద ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టర్బో, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం గం.11.56 సమయానికి సెన్సెక్స్ 156.55 (0.42%) పాయింట్లు లాభపడి 37,829.86 వద్ద, నిఫ్టీ 28.45 (0.25%) పాయింట్లు లాభపడి 11,203.20 వద్ద ఉంది.
ఉదయం పది గంటల సమయానికి యస్ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంకు,ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఏసియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, మారుతీ, బజాజ్ ఫిన్ కార్ప్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

టాప్ గెయినర్స్...
మధ్యాహ్నం సమయానికి.. టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకులు ఉన్నాయి.
టాప్ లూజర్స్
మధ్యాహ్నం సమయానికి.. టాప్ లూజర్స్‌లో బీపీసీఎల్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, గెయిల్, ఓఎన్జీసీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications