మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారా? అయితే ఒక్కసారి మీ పాన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకోండి. భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) దీన్ని తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లో పాన్ నెంబర్ ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలున్నాయి. ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి దర్యాప్తు నిర్వహించింది. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, రిజిస్ట్రార్, ట్రాస్ఫర్ ఏజెంట్స్ పాన్ వివరాలు లేకున్నా రెడెంప్షన్ అభ్యర్థనలను ప్రాసెస్ చేసినట్టు గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాన్ అప్డేట్ ఆదేశాలు వెలువడినాయి.
* సాధారణంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నో యువర్ కస్టమర్ కు సంబంధించిన వివరాలు ఇచ్చే సమయంలో పాన్ వివరాలు కూడా ఇస్తుంటారు. కొన్ని కేటగిరీలకు మాత్రం పాన్ వివరాల నుంచి మినహాయింపు నిచ్చారు. ఇలాంటి ఇన్వెస్టర్లు పాన్ కు బదులుగా ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అప్ డేట్ చేయండిలా...
* మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ ఫోలియోలో పాన్ నెంబర్ ను సులభంగానే అప్డేట్ చేయవచ్చు.
* మ్యూచువల్ ఫండ్ వెబ్ సైట్, ఆర్ టీ ఏ లేదా నేరుగా పాన్ వివరాలు మ్యూచువల్ ఫండ్ కార్యాలయం లేదా ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ లో ఇవ్వవచ్చు.
* కామ్స్ ఇన్వెస్టర్ సర్వీసెస్, కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ వంటివి పాన్ కు సంబంధించిన సేవలను అందిస్తున్నాయి.
* ఇన్వెస్టర్లు అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఫోలియో నెంబర్, పుట్టిన తేదీ లేదా డీఫాల్ట్ బ్యాంక్ నెంబర్ ను అతేంటికేషన్ కోసం తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ అటెస్టేడ్ పాన్ కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
* ఆర్ టీ ఏ వద్ద ఉన్న సంతకంతో సరి చూ సిన తర్వాత పాన్ అప్ డేట్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయినా తర్వాత ఇన్వెస్టర్ కు సమాచారం అందుతుంది.
* ఒక్కో మ్యూచువల్ ఫండ్ లో ఒక్కో ఏడాదికి రూ.50,000 వరకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు పాన్ వివరాలు వెల్లడించాల్సి అవసరం లేదు.
అప్ డేట్ చేయకపోతే..
* ఫోలియో పాన్ వివరాలతో అప్ డేట్ కాకపోతే ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్ లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉంటుంది. అంటే మీరు స్కీం పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కష్టంగా మారుతుంది.
* అందుకే పాన్ వివరాలను అప్ డేట్ చేయడం మంచిది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications